Sri swaroopanandendra saraswati and bv raghavulu controversial comments on chandrababu naidu

sri swaroopanandendra saraswati and bv raghavulu controversial comments on chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu naidu news, bv raghavulu comments on chandrababu naidu, sri swaroopanandendra saraswati comments on chandrababu naidu, sri swaroopanandendra saraswati controversial comments on chandrababu naidu, andhra pradesh cm chandrababu naidu, chandrababu naidu government

sri swaroopanandendra saraswati and bv raghavulu controversial comments on chandrababu naidu

బాబు పరిపాలనలో వర్షాలు రావడంలేదు..?

Posted: 07/01/2014 12:27 PM IST
Sri swaroopanandendra saraswati and bv raghavulu controversial comments on chandrababu naidu

(Image source from: sri swaroopanandendra saraswati and bv raghavulu controversial comments on chandrababu naidu)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచి చంద్రబాబు నాయుడి మీద విమర్శలు చాలా ఎక్కువయ్యాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఐదుమంది వ్యక్తులు చనిపోయారని, ఆ తరువాత ఎన్నో ప్రమదాలు జరుగుతూనే వున్నాయని ఆయన మీద ప్రతిఒక్కరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు వర్షాలు కురవలేదని, ఎండలు విపరీతంగా పెరిగిపోయి రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని... తెలంగాణాలో కొన్నాళ్లపాటు వర్షాలు కురవడంతోపాటు చల్లని వాతావరణం కూడా వుందని ఘాటు కామెంట్లు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠాధిపతి అయిన శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి కూడా చంద్రబాబు మీదే ఇటువంటి విమర్శలు చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ ఆవిర్భావం తప్పకుండా జరుగుతుందని గతంలో కూడా ఆయన నొక్కివక్కానించి మరీ చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో బాబు ప్రభుత్వం ఏర్పడితే వర్షాలు కురవవని, గతంలో ఆయన ప్రభుత్వం వున్నప్పుడు కూడా ఇటువంటి దుస్థితి ఏర్పడిందని బాబు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడినప్పుడు 5 మంది చనిపోయారని... ఇంకా ముందుముందు ఇటువంటి నష్టపరిహారాలు చాలా చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

అందులో భాగంగానే... ‘‘సూర్యాస్తమయం తరువాత ప్రమాణ స్వీకారం చేయడం మంచిది కాదని... అసలు ఆ సమయం అంత శ్రేయస్కరమైనది కాదు. గతంలో ఇలా సూర్యాస్తమయం తరువాత ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు దుష్ఫలితాలు పొందారు. అసలు వారు రాజకీయాల్లో పత్తా లేకుండా పోయారు’’ అని గుర్తు చేసుకుంటూ బాబును తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ మాటలు విన్న టీడీపీ శ్రేణులు మాత్రం... ఇటువంటి మాటలు పట్టించుకోవద్దని ప్రజలను సమర్థించుకుంటున్నారు.

ఇదిలావుండగా... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు అయిన బీవీ రాఘవులు కూడా చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కరువుకాలం తప్ప... ఎటువంటి వర్షాలు రావని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అన్నారు. గతంలో కూడా ఈయన పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కరువు మాత్రమే వచ్చిందని... ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అదే పరిస్థితిని ఏర్పడనుందని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles