Prisoners tasty mango crop in rajahmundry central jail

Prisoners tasty mango crop in jail, rajahmundry central jail, Prisoners tasty mango crop, rajahmundry central jail Prisoners.

Prisoners tasty mango crop in rajahmundry central jail

శిక్షపడింది- అద్బుతాలు సృష్టిస్తున్నారు.

Posted: 07/03/2014 08:19 AM IST
Prisoners tasty mango crop in rajahmundry central jail

తప్పు చేసినందుకు శిక్ష పడింది. దీంతో వారు అద్బుతాలు సృష్టిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సహజంగా అందరికి జైలు అంటే చాలా భయం. జైలుకు వెళ్లితే.. ఇక బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. అంత జైలు జీవితమే అని చాలా మంది ఖైదీలు బాధపడుతుంటారు కానీ ఈ ఖైదీలు అలా కాదు.. జైల్లో శిక్ష అనుభవిస్తూనే.. అద్బుతాలు సృష్టిస్తున్నారు. కానీ జైల్లో మాత్రం ఏదో ఒక వృత్తిలో శిక్షణ పొందుతుంటారు. నేరాలు చేసిన వాళ్ల చేతులు.. ఇప్పుడా జైల్లో అద్భుతాలు చేస్తున్నాయి.

రాజమండ్రి సెంట్రల్ జైలు.. బయటి ప్రపంచానికే ఇది కారాగారం. కాని లోపలికి వెళితే మాత్రం అలా ఎవరూ అనరు. ఇక్కడ ఖైదీలు చేస్తున్న పని చూస్తే ఇదో వృత్తి శిక్షణాలయంలా అనిపిస్తుంది. ఖైదీలుగా ఇక్కడికొచ్చిన వారు ఏదో ఒక వృత్తిలో సుశిక్షితులై బయటకు వెళుతుంటారు. అలా మామిడి తోటల పెంపకంలో ఇక్కడి ఖైదీలు మంచి పేరు సంపాదించుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనుబంధంగా ఉన్న వ్యవసాయ క్షేత్రంలోని 70 ఎకరాల్లో....20 ఎకరాలు మామిడితోటను పెంచారు ఖైదీలు. కృత్రిమ ఎరువులు వాడకుండా..పూర్తి సేంద్రీయ పద్థతులతో తోటను అభివృద్ది చేశారు. దీంతో జైలులో పండించే మామిడిపండ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. చుట్టు పక్కల నుంచే కాకుండా , విదేశాలకు సైతం ఇక్కడి పండ్లు ఎగుమతి అవుతున్నాయి.

Prisoners-tasty-mango-crop-in-jail

మామిడితోటల్లో ఖైదీలు చూపించే శ్రద్ధ అంతా ఇంతా కాదు. అది పై అధికార్ల భయం వల్ల కావచ్చు...లేదా స్వతహాగా నేర్చుకోవాలన్న తపన కావచ్చు..కారణం ఏదైతేనేం...అధిక దిగుబడిఎక్కువ నాణ్యతతో కూడిన పండ్లు, కాయల్ని అందిస్తున్నారు. ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం వరకూ షిఫ్ట్ ల వారీగా ఖైదీలు మామిడితోటల్లో పనిచేస్తారు. దీనికి గాను రోజుకి కొంత మొత్తం వీరికి జీతాలుగా చెల్లిస్తారు జైలు అధికారులు. తోటలో మొత్తం దాదాపు వందమంది ఖైదీలు పనిచేస్తుంటారు..

ప్రస్తుతం ఈ జైలులో అన్ని రకాల మామడి పండ్లు లభిస్తాయి. వినియోగదారుడు తనకు నచ్చిన చెట్టు కాయను ఎంచుకోవచ్చు. ఎన్నికాయలు కావాలంటే అన్ని కాయల్ని...ఆ కస్టమర్ ముందే ఖైదీలు కోసిస్తారు. కస్టమర్ల కోసం చేసే ప్యాకింగ్ కూడా విభిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక్కో కాయకు ఒక్కో పేపర్ చుట్టి...అప్పటికప్పుడే ప్యాక్ చేస్తారు.

ఈ మామిడి తోటపై జైలుకు ఏడాదికి 50 లక్షల వరకూ ఆదాయం సమకూరుతోంది. మామిడి తోటతో పాటు భవిష్యత్ మరిన్నిరకాల పళ్ల తోటలు పెంచాలని భావిస్తున్నారు అధికారులు..ఏమైనా ఖైదీలకు ఈ జైలు అనుభవం జీవనోపాధినే కాదు... బయటికి వచ్చాక కొత్త జీవితానికి దారి చూపుతుందనడంలో ఎలాంటి సందేహ లేదు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles