Lawer files pil for suo motu of tapas pal comments

pil on tapas pal comments, lawer files pil for suo-motu of tapas pal comments, tapas pal apologizes for his comments on women

lawer files pil for suo-motu of tapas pal comments

పార్టీ నాయకురాలు పట్టించుకోకపోతే కోర్టుల్లేవా

Posted: 07/02/2014 06:36 PM IST
Lawer files pil for suo motu of tapas pal comments

తపస్ పాల్ మీద పశ్చిమ బెంగాల్ పోలీసులు సుమోటు గా స్వీకరించి ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యాలంటూ లాయర్ సమిత్ సాన్యాల్ పశ్చిమ బెంగాల్ హైకోర్ట్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసారు.  తపస్ పాల్ మహిళల పట్ల అనుచితంగా చేసిన వ్యాఖ్యలను కాగ్నిజెన్స్ గా తీసుకోవాలని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అతని మీద చర్య తీసుకోవాలని తన పిల్ లో కోర్టుని కోరారు.  

అయితే ఇప్పటికే తను చేసిన అనుచిత వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ రాతపూర్వకంగా పార్టీకి, మీడియాకు కూడా క్షమాపణ పత్రాన్ని అందజేసారు.  క్షమాపణ పత్రంలో, ఎన్నికల ప్రచారం వేడిలో అనుకోకుండా దొర్లిన తప్పులకు బేషరతుగా క్షమాపణ కోరుకుంటున్నానని ఆయన అందులో రాసారు.  సిపిఐ-ఎమ్ కార్యకర్తలను చంపేస్తానని, వాళ్ళ మహిళలను రేప్ చెయ్యటానికి తన దగ్గరున్న కుర్రాళ్ళను పంపిస్తానని అప్పుడు తపస్ పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటపడి దుమారం రేపుతున్నాయి.  

అయితే తపస్ పాల్ క్షమాపణ పత్రం మరో ఆరోపణకు కూడా దారితీసింది.  

చూసారా తపస్ పాల్ ఆ మాటలను 2014 ఎన్నికల ముందు అన్నారట.  ఇప్పుడాయన కృష్ణానగర్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు.  కాబట్టి ఎన్నికల కమిషన్ ఆయన మీద చర్య తీసుకోవాలని కూడ లాయర్ తను ఫైల్ చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కోరారు.  ఈ విషయంలో ముఖ్యమంత్రి, పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ మహిళా నాయకురాలయ్యుండీ చర్య తీసుకోకపోవటంతో లాయర్ కోర్టుని ఆశ్రయించానని చెప్పారు

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles