Chandrababu to talk to kcr to solve problems

chandrababu to talk to kcr to solve problems, electricity problem between telangana and ap, water sharing problem between ap and telangana, ap honoring ppa chandrababu states

chandrababu to talk to kcr to solve problems

రండి కెసిఆర్ కూర్చుని మాట్లాడుకుందాం- బాబు

Posted: 07/03/2014 09:58 AM IST
Chandrababu to talk to kcr to solve problems

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం తెలంగాణా ముఖ్యమంత్రికి కూర్చుని మాట్లాడుకుని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఆహ్వానించారు.  

చంద్రబాబు పరిష్కరించదలచుకున్న సమస్యలలో ఒకటి కృష్ణా డెల్టాకి తెలంగాణా నుంచి వెళ్ళే త్రాగునీరు, రెండవది హైద్రాబాద్ లో జరుగుతున్న కట్టడాల కూల్చివేతలు.

ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ రంగం మీద శ్వేతపత్రాన్ని విడుదలచేసిన చంద్రబాబు, మీడియా ప్రతినిధులతో, రాష్ట్ర విభజన తర్వాత సాగునీరు, విద్యుత్ సమస్యలు వస్తాయని తాను ముందుగానే హెచ్చరించానని అన్నారు.  ఆ సమస్యల మీద చేపట్టవలసింది ఆందోళనలు కాదని, పరస్పర సహకారంతో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారమార్గాలను శోధించాలని అన్నారు.  

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటున్నారని, దాని ప్రభావం సదరన్ గ్రిడ్ మీద పడుతోందని అనటం సరికాదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఏ) పాటిస్తున్నదని అన్న చంద్రబాబు మరోసారి హైద్రాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసింది తానేనని గుర్తుచేస్తూ ఇరు రాష్ట్రాల పట్ల తనకి సమానమైన బాధ్యతుందని, తెలంగాణా ప్రజలు 23 శాతం వోట్లు తమకే వేసారని అన్నారు.  

రాజకీయాలు వేరు, ప్రజా సంక్షేమం వేరని అన్న చంద్రబాబు ఏ సమస్యనైనా మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చని అన్నారు.  ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు తాను కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ ని కలిసి ఇరు రాష్ట్రాలకు ఇంకొంచెం ఎక్కువ విద్యుత్ ని కేటాయించి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడిచేట్టుగా చెయ్యమని కోరానని చంద్రబాబు తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles