Kcr to amend laws to suit telangana

kcr to amend laws to suit telangana, kcr wants decentralized power, telangana to have their own welfare activities, kcr wants governance from local bodies level

kcr to amend laws to suit telangana

మన తెలంగాణాలో మన చట్టం ఉండాలి

Posted: 07/03/2014 10:22 AM IST
Kcr to amend laws to suit telangana

మనం తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నాం.  ఇప్పుడు మన రాష్ట్రంలో మనకు అనుకూలమైన చట్టాలుండాలి కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలమైనవి కావు అన్నారు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు.  ప్రస్తుతమున్న పథకాలు, ప్రభుత్వ విధానాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ దృష్టికోణంతో ఏర్పడ్డవే నని, వాటిని తెలంగాణాకు అనుగుణఁగా మార్చుకోవలసిన అవసరం ఉందని బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన మేధో మథన సదస్సులో కెసిఆర్ అన్నారు.  రాష్ట్రంలో సమగ్రమైన అభివృద్ధికి కావలసిన ప్రణాళికల రూపకల్పన చేసుకోవటం అవసరమని ఈ సందర్భంగా కెసిఆర్ అన్నారు.  

కొందరు అధికారులు కూర్చుని ప్రభుత్వ విధానాలను రూపొందించ విధానానికి స్వస్తిపలకాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ అవసరమైన ప్రణాళికలను అక్కడే రూపొందించుకునే వెసులుబాటు కలిగించాలని కెసిఆర్ అన్నారు.  స్థానిక సంస్థల ప్రజాప్రతినిదుల దగ్గర్నుంచి అభివృద్ధి పథంలో బాటలు వెయ్యాలని కెసిఆర్ సూచించారు.  కొత్త ప్రభుత్వ విధానాలు, కొత్త జిల్లాల ఏర్పాట్లు, రాష్ట్రాభివృద్ధికి లక్ష్యాలు ఇలాంటి విషయాలను మంత్రులు అధికారులు కూర్చుని మాట్లాడుకోవాలని అన్నారాయన.  

ముఖ్యంగా కెసిఆర్ చెప్పిన విషయమేమిటంటే, రాష్ట్ర స్థాయిలోనే అన్ని నిర్ణయాలను తీసుకోరాదని, రాష్ట్రమంతటా ఒకే విధానంలా కాకుండా జిల్లా వారీగా అక్కడి స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు.  అంటే, అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తున్నానని అన్నారు కేసిఆర్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles