ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎంతో హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఆవిర్భవించి... బీజేపీ-టీడీపీ పార్టీల తరఫున ప్రచారం చేశారు. మరోవైపు మెగాస్టార్, మాజీకేంద్రమంత్రి చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాలు చేసిన సంగతి విదితమే! ఇద్దరు అన్నదమ్ములు ‘‘నువ్వా-నేనా’’ అనే రీతిలో ప్రచారాల్లో పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ ‘‘కాంగ్రెస్ కో హటావ్ దేశ్ కో బచావ్’’ అనే నినాదాలు చేస్తే... చిరంజీవి ‘‘మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి’’ అంటూ నినాదాలు చేసుకున్నారు. అయితే ఎన్నికల తరువాత అసలు విషయం బయటపడిపోయింది. ఇటు తెలంగాణా - ఆంధ్రా రాష్ట్రాల్లోనే కాకుండా... కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి, పత్తా లేకుండా పోయింది. దీంతో చిరంజీవి కూడా మీడియాకంట పడకుండా కొన్నాళ్లవరకు కనుమరుగైపోయారు. ఆ పార్టీ నిర్వహించుకున్న కొన్ని కమిటీలకు ఆయన హాజరు కాలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా ఆయన హాజరు కావడం లేదని కాంగ్రెస్ నేతలు ఆయనపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. దీంతో చిరంజీవి పరిస్థితి దారుణంగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
చిరంజీవి పరిస్థితి ఇలా వుండగా... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ మాత్రం ఎన్నికల తరువాత మరింతగా పెరిగిపోయింది. బీజేపీ - టీడీపీ పార్టీల తరఫున ఆయన ప్రచారం చేయడంతో ఈ పార్టీ నాయకులు ఈయనను తమ బ్రాండ్ ఇమేజ్ గా మార్చుకున్నారు. స్వయాన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పవన్ కు కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు ముందుకు వచ్చినా... పవన్ మాత్ర దానిని సున్నితంగా తిరస్కరించారు. పవన్ కు అధికారం లేకపోయినా... బీజేపీ - టీడీపీ పార్టీలకు ఈయన చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ... ఆయన ఎప్పుడూ వస్తానంటే అప్పుడు అధికారంలో ఏ మంత్రి పదవి ఇవ్వడానికైనా సిద్ధమని ప్రకటించేశాయి. దటీజ్ పవన్ కల్యాణ్ అంటూ ప్రతిఒక్కరూ ఈయనను పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించారు.
ఇవన్నీ గతంలో జరిగిన విషయాలు...! ఇప్పుడు తాజాగా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి అయిన చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికల కోసం సరియైన నిర్ణయాలు తీసుకోవడం కోసం తన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కల్యాణ్ ను కలిసినట్టు వార్తలొస్తున్నాయి. బహుశా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి, బీజేపీలో చేరడానికి ఇలా కలిసుంటారని ప్రతిఒక్కరు గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయంపైనే వారిద్దరి మధ్య చర్చలు జరిగి వుంటాయని చెబుతున్నారు.
కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. చిరంజీవి గత కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడం లేదని... ఆ పార్టీ తరఫున మీటింగులకు హాజరు కావాల్సిందిగా ఎన్నిసార్లు పిలుపునిచ్చిన ఆయన సరిగ్గా హాజరు కావడం లేదని వారు ఆరోపించారు. ఆయన వ్యవహారం చూస్తుంటే... కాంగ్రెస్ కు క్రమంగా దూరమవుతున్నారని వారు పేర్కొంటున్నారు. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇకనుంచి కొనసాగేటట్లు లేరని వారు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం కావడంతో చిరంజీవి ఆంధ్రాలో చేసిన ప్రచారాలు నీరుగారిపోయాయి. కేంద్రమంత్రి పదవి కూడా లేకపోవడంతో ఆయనకు నాలుగువైపులా దార్లు మూసుకుపోయాయి. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణాలో ఆయనకు సరిగ్గా గౌరవం కూడా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో తమ్ముడు పవన్ కల్యాణ్ ను కలిసి... బీజేపీ పార్టీలో చేరేందుకు ఈ విధంగా కలిసి వుంటారని ప్రచారం సాగుతోంది. తాను కోల్పోయిన మర్యాదల్ని తిరిగి పొందడానికే తన తమ్ముడి సహాయం తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ వీరిద్దరు కలిసింది నిజమే అయితే... పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తాడోనని అందరూ ఎదురు చూస్తున్నారు. అతను అన్నయ్యకు సహాయం చేస్తాడా..? లేదా..? అన్న కోణంలో ప్రతిఒక్కరు ఆసక్తిగా వున్నారు.
చిరంజీవి కూడా తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తారా...? లేక కాంగ్రెస్ పార్టీ నుంచి శాశ్వతంగా తప్పుకుని సినిమాల మీద దృష్టి సారిస్తారా..? అనే ప్రశ్నలు ప్రతిఒక్కరి మదిలో మెదులుతున్నాయి. లేదా తమ్ముడి సహాయంతో బీజేపీలో చేరి తన పూర్వ వైభవాన్ని తిరిగి తెప్పించుకుంటారా..? అనే రాజకీయ కోణంలో కూడా కొంతమంది విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. అన్నదమ్ములు కలిసి ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగానే మారిపోయింది. దీనికి సంబంధించిన వార్తలు ఇంకా వెలువడాల్సి వుంది. వెయిట్ అండ్ సీ!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more