Jagan meets governor narasimhan over tdp behavior in zp elections

Jagan Meets Governor Narasimhan, TDP Behavior, jaganmohan reddy, ysr congress party president, allegations on chandrababu naidu, andhrapradesh cm, tdp president, mlas and mlcs jumping in other parties, jaganmohan reddy and governor narasimhan

Jagan Meets Governor Narasimhan over TDP Behavior

ఆంధ్రను చూసి భయపడుతున్న జగన్ !

Posted: 07/07/2014 06:47 PM IST
Jagan meets governor narasimhan over tdp behavior in zp elections

ఎనకటికి ఒక ఆమె.. ఆ వంకర్ టింకర్ కాయలు ఏమిటని వయ్యరంగా అడిగిందనే సామెత గుర్తుకు వస్తుంది. అందులో పుట్టి పెరిగి, వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉన్న సమయంలో.. అక్రమా ధనం రావటంతో.. ఆమె కళ్లు నెత్తికెక్కి.. ఆ వంకర్ టింకర్ కాయులు ఏమిటన పక్కంటి పంకజాన్ని అడిగింది. ‘‘నీ సోకులు జొన్నలు తొక్క .. అవి చింతకాయులు’’ మొన్నటి వరకు ఆ చింతకాయలకే నీకు అన్నం పెట్టింది. మాయదారి సొమ్ము రాబట్టే, నీ కళ్లకు మాయ అడ్డుపడతుందని నాలుగు చీవాట్లు పెట్టింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఆంద్రలో ఉండాలంటే చాలా భయమేస్తుందని, ఉమ్మడి గవర్నర్ వద్దకు వెళ్లి తన బాధలను చెప్పుకోవటం మొదలుపెట్టి జగన్, ఆవేశంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా ? లేక గూండాస్వామ్యమా ? అంటూ జగన్ ప్రశ్నించారు. అసలు ఆంధ్రరాష్ట్రంలో ఉండాలంటేనే భయమేస్తోందన్నారు. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన గవర్నర్ నరసింహన్ ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం అనుసరించిన విధానాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

మెజారిటీ లేకపోయినా ఇతర పార్టీల సభ్యులను ప్రలోభపెట్టడం దగ్గర్నుంచి భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. అంతేగాక ఎన్నికలను వాయిదా వేయించడం..వైఎస్ఆర్ సీపీ సభ్యులందరినీ బయటకు పంపేసి టీడీపీ వాళ్లు జడ్పీ ఛైర్మన్లుగా ఎన్నికైనట్లు ప్రకటించడం.. లాంటి అరాచకాలన్నింటినీ గవర్నర్ నరసింహన్ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు.

వీటికి సంబంధించిన దృశ్యాలను సీడీల రూపంలో ఆయనకు అందించామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. జగన్ చెప్పిన విషయాలను ఓపికగా విన్న గవర్నర్ అయ్యో జగన్ .. నీకు ఎంత కష్టం వచ్చిందయ్యా... అంటూ కొద్ది సేపు ఓదార్చి, తగిన చర్యలు తీసుకుంటాని చెప్పి, జగన్ పంపించినట్లు పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles