Aeroplane officials echoed an andhra man from the plane in iraq

aeroplane officials echoed an andhra man from the plane in Iraq, telugu people in iraq, andhra man parvathy raju in iraq, aeroplane officials echoed from the plane an andhra man in Iraq

aeroplane officials echoed an andhra man from the plane in Iraq

ప్లేన్ లో చోటులేదని తెలుగువాడిని గెంటేశారు!

Posted: 07/11/2014 12:02 PM IST
Aeroplane officials echoed an andhra man from the plane in iraq

(Image source from: aeroplane officials echoed an andhra man from the plane in Iraq)

ఇరాక్ లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న మన భారతీయులను తిరిగి శానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే! ఇంతవరకు అంతా బాగానే వుంది కానీ... అందరినీ కలచివేసే ఓ విషాదగాధ ఇక్కడ చోటు చేసుకుంది. భారతీయులు తిరిగి దేశానికి పయనమవుతున్న విమానంలో అస్సలు ఖాళీ స్థలమే లేదని... ఓ తెలుగువాడిని ఇరాక్ లోనే వదిలేసి వచ్చారు. నిజంగా ఇది సభ్యసమాజం తలదించుకునేలా చేసే సంఘటన!

పశ్చిమగోదావరి జిల్లాకు త్యాజంపూడికి చెందిన గనసాల పార్వతీరాజు అనే ఈ తెలుగువ్యక్తి... ఉపాధికోసం కొన్నాళ్ల క్రితం ఇరాక్ కు చేరుకున్నాడు. అక్కడ హాసన్ అనే కంపెనీలో విధుల్లో చేరాడు. అంతా సవ్యంగా నడుస్తున్న క్రమంలో అనుకోకుండా ఇరాక్ లో పరిస్థితులు విషమంగా మారడంతో... అక్కడున్న మన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం కోసం అన్ని ఏర్పాటు చేసింది.

ఈ విషయం తెలుసుకున్న రాజు, అతని స్నేహితులందరూ సదరు విమానం వున్న చోటుకు చేరుకున్నారు. ఒకేసారి భారతీయులందరూ ఆ విమానంలో ఎక్కడం ప్రారంభించారు. అందులో ఇంకా స్థలం మిగిలి వుందో లేదో తెలియదు కానీ... అధికారులు మాత్రం ప్లేన్ లో ఖాళీ లేదని ఆ వ్యక్తిని విమానంలోకి రాణించుకోలేదు. ఇక విమానం అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసింది.

అయితే అక్కడే వుండిపోయిన పార్వతీరాజు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు అన్యాయం జరిగిందంటూ భారత్ లో వున్న ఒక విలేకరికి ఫోన్ చేసి మాట్లాడిన పార్వతీరాజు... తనతో జరిగిన విషాదగాధ గురించి వెళ్లబోసుకున్నాడు. తనను ఎలాగైనా భారత్ కె తీసుకువెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వేడుకున్నాడు. తన స్నేహితులు క్షేమంగా భారత్ కు చేరుకుంటుంటే... అతను మాత్రం అక్కడే వుంటూ ఏడ్చానని చెప్పుకున్నాడు.

తనతోపాటు ముగ్గురు చెన్నైవాసులు, కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి, బీహార్ చెందిన మరో వ్యక్తిని కూడా ఇరాక్ లోనే వదిలేశారని అతను తెలిపాడు. ఎప్పుడు, ఏమి జరుగుతుందోనన్న భయంతో, రోజు గడవలేక అందరం చస్తూ, బతుకుతున్నామని వేడుకుంటున్నాడు పార్వతీరాజు. మరి.. మన భారతప్రభుత్వం అతనితోపాటు అక్కడే నిలిచిపోయిన భారతీయుల్ని తిరిగి స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు ఏమైనా తీసుకుంటుందా..? లేదా..? అనే విషయాలు మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఇరాక్ లోనే వున్నవారు అందరూ క్షేమంగానే వున్నారని ఆశిద్దాం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles