(Image source from: telangana tdp mlas looking to jump in trs party)
ఏకంగా పదిసంవత్సరాలకు అధికారం నుంచి దూరం అయిన చంద్రబాబునాయుడు... తిరిగి అధికారం దక్కించుకోవడం ఎన్ని అవస్థలు పడ్డారో అందరికీ తెలిసిందే! పాదయాత్ర పేరుమీద దాదాపు 3000 వేల కిలోమీటర్ల వరకు చక్కర్లు కొట్టిన బాబు... నిద్రాహారాలు మానేసి జనం మధ్య తిరిగారు. ఇటు తెలంగాణ అంటు ఆంధ్రప్రదేశ్ లోనూ తన పార్టీయే అధికారంలోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయనకు సీఎం పీఠం ఎక్కించినా... తెలంగాణ ప్రజలు మాత్రం ఈయనను, పార్టీని తిరస్కరించారు. ఒకవైపు సంతోషంగానే వున్నా... మరోవైపు దు:ఖంతో కొట్టుమిట్టాడుతున్నారు.
తెలంగాణాలో టీడీపీ పార్టీ అధికారంలోకి రాలేదని ఇక్కడున్న టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్ల నుంచి అధికారానికి దూరమయిన ఈ ఎమ్మెల్యేలకు ఈసారి కూడా తెలంగాణ ప్రజలు మొండిచెయ్యి చూపడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు రాజకీయ భవిష్యత్తు తెలంగాణాలో వుండదని భావించిన వీరు... గులాబీ కండువా కప్పుకోవడానికి వ్యూహం చేస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమంది అభ్యర్థులు... టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవ్వాలని మెంటల్ గా ఫిక్స్ అయినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే పార్టీ మారితే ఎమ్మెల్యే పదవులకి అనర్హత వేటు పడుతుంది. దీంతోవారు ఈ వేటు నుంచి తప్పించుకోవడానికి అందరూ కలిసికట్టుగా పన్నాగం పన్నినట్టు వెల్లడిస్తున్నారు. సాధారణంగా ఐదుగురు ఎమ్మెల్యేలు లేదా అంతకంటే ఎక్కువమంది చీలిపోతే.. వారిపై అనర్హత వేటు పడదు. ఈ విధంగా తెలుగుతమ్ముళ్లు కూడా అందరూ కలిసి చీలిపోయేందుకు సిద్ధమవుతున్నారని స్పష్టం చేస్తున్నారు.
ఇందులో ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ (సికింద్రాబాద్), ప్రకాష్ గౌడ్ (రాజేందర్ నగర్), వివేకానందగౌడ్ (కుత్పుల్లాపూర్), రేవంత్ రెడ్డి (కొడంగల్), రాజేందర్ రెడ్డి(నారాయణ పేట) తదితర ఎమ్మెల్యేలు కారు ఎక్కాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ జాబితాపై ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి వుంది. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే రేవంత్ రెడ్డి తాను గులాబీ కండువా కట్టుకోవడం లేదని ఖండిస్తున్నా... జంప్ అవడం ఖాయమనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యేలు గనుక టీడీపీ నుంచి తెరాసలో చేరితే... తెలంగాణాలో టీడీపీ పార్టీకి భారీ దెబ్బ పడటం ఖాయమని అంటున్నారు. ఇందుకు సబంధించిన మొత్తం సమాచారం శ్రావణమాసంలో వెల్లడవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more