Kcr asks chandrababu to behave

KCR asks Chandrababu to behave himself, KCR warns Chandrababu Naidu, Naidu not reciprocating respect KCR says

KCR asks Chandrababu to behave himself

ఒళ్ళు దగ్గరపెట్టుకో బాబూ- కెసిఆర్ హెచ్చరిక

Posted: 07/17/2014 09:58 AM IST
Kcr asks chandrababu to behave

తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బుధవారం కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు.  

అన్ని విషయాలలో తాము చట్టబద్ధంగానే పోతున్నామని, చంద్రబాబే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్న కెసిఆర్, చంద్రబాబు పిపిఏ ల రద్దుల మీద ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.  ఒకవైపు కారం పెడుతూనే మరోవైపు సఖ్యతంటూ మాట్లాడటం తగదని చంద్రబాబు ని విమర్శించారాయన.  

చర్చలకు రమ్మంటున్న చంద్రబాబు మాటలకు జవాబుగా, చర్చలకు మేమూ సిద్ధమే, అవసరమైతే మేమూ చర్చలకు వస్తామని అన్న కెసిఆర్, తాను చంద్రబాబుని పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా గౌరవిస్తానని,  ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లా, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా గౌరవిస్తామని, అయితే ఆయన దగ్గర్నుంచి మాత్రం తనకు అలాంటి గౌరవం లభించటం లేదని అన్నారు.

మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికీ మీ ఇల్లు అంతే దూరం అన్న తరహాలో కెసిఆర్, మాకు మీతో ఎంత అవసరముంటుందో మీకూ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా మాతో అంతే అవసరం ఉంటుంది అని అన్నారు కెసిఆర్.  అందువలన అనవసరమైన డాంబికాలు, డంబాచారాలు మానేసి ఒళ్ళు దగ్గరపెట్టుకుని వ్యవహరిస్తే ఎవరికైనా మంచిదని కెసిఆర్ చంద్రబాబుకి మీడియా ద్వారా హితవు పలికారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles