Andhra pradesh capital undecided but leaked

Andhra Pradesh Capital undecided, Ministers for Vijayawada Guntur as Capital, Ministers and leaders defend capital at Vijayawada Guntur, AP capital undecided Chandrababu says

Andhra Pradesh Capital undecided but leaked by Ministers and Speaker

ఆం.ప్ర. రాజధాని విషయంలో బ్రెయిన్ వాష్?

Posted: 07/18/2014 10:09 AM IST
Andhra pradesh capital undecided but leaked

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అన్నది వ్యాపార రీత్యా స్థిరాస్థి వ్యాపారులకు, స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టేవారికి, కొత్తగా వ్యాపార, సేవా సంస్థలను నెలకొల్పాలనుకునేవారికి ఉత్కంఠను ఎక్కువగానే కలిగించినా, రాష్ట్ర ప్రజలకు కూడా తమ రాజధాని ఎక్కడో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంటుంది.  ఇంతవరకు ఎక్కడో తెలియకపోతే ఇక దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవాలన్నది వారి ఆత్రుతకు కారణమవుతోంది.  అయితే ఈలోపులో రాజధాని ఎక్కడన్నది నెమ్మది నెమ్మదిగా లీక్ చేస్తూ ప్రజల మనసుల్లో దాని మీద సమ్మతి వచ్చేలా చెయ్యటం కూడా అవసరమని అనుకున్నారేమో మంత్రులు ఒక్కొక్కరుగా రాజధాని విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉంటుందని, అలా ఉండటమే అన్నిటికీ అనువుగా ఉంటుందని చెప్తున్నారు.  

తాజాగా మంత్రి పరిటాల సునీత, స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  రాజధాని రాష్టానికి నడిబొడ్డున ఉండటమే అందరికీ అందుబాటులో ఉంటుందని పరిటాల సునీత అన్నారు.  ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు విజయవాడ గుంటూరు లో రాజధాని నిర్మిస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని కోడెల అన్నారు.  విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి ప్రాంతాలను కలుపుతూ 190 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును కేంద్రం నిర్మిస్తుందని కోడెల అన్నారు.  దానికి తోడు అన్ని ప్రాంతాలకు రోడ్డు రైలు మార్గాల అనుసంధానం కలిగిన ప్రాంతం అదేనని కూడా కోడెల అన్నారు.  

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రాజధాని ఎక్కడో ఇంకా తేల్చలేదని అంటున్నారు.  చెప్పీ చెప్పీ రాష్ట్ర ప్రజలకు చివరకు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మనసుల్లో అక్కడే రాజధానని ముద్రపడుటం జరుగుతుంది, ఒకవేళ అక్కడ కాని పక్షంలో ముఖ్యమంత్రి మాటివ్వలేదు కాబట్టి మంత్రులు చెప్పివన్నీ వాళ్ళ అభిప్రాయాలని అనటానికి కూడా ఆ తర్వాత వీలుంటుంది.  దీనివలన ఏ ప్రాంతం వారినీ నొప్పించకుండా పరిస్థితులను సానుకూలంగా చేసుకోవటానికి కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.  మరొకటేమిటంటే ఎవరికైనా అభ్యంతరాలున్నా, ప్రతిఘటనలు తలేత్తేట్టున్నా ఇప్పుడే తెలిసిపోతుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles