Tdp training classes for andhra pradesh mlas on july 18 19

TDP training classes, Andhra pradesh mlas, mlas, training classes, speaker kodela sivaprasada rao.

TDP training classes for andhra pradesh mlas on july 18-19, Chandrababu MLAs to get two-day training from July 18, Speaker K Sive Prasad, Training Classes for AP New MLAs on July 18,19 - Speaker Kodela,

టిడిపి హౌస్ లో ట్యూషన్ ర్యాంకులు!

Posted: 07/18/2014 09:54 AM IST
Tdp training classes for andhra pradesh mlas on july 18 19

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకు నేటి నుంచి రెండు రోజుల పాటు టిడిపి హౌస్ లో ట్యూషన్ జరుగుతుంది. బాబు ట్యూషన్ లో ముఖ్యమంగా నేర్పే అంశాలు ..ఇవే!! ప్రజాప్రతినిధులు అంటే ఎలా ఉండాలి ? అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి ? అనే దానిపై ఎమ్మెల్యేలకు క్లాసులు ఇవ్వనున్నారు. ఎన్నికైన వారిలో 98 మంది కొత్తవారే ఉన్నారు. ఉదయం 10గంటలకు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాగతోపన్యాసంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గ్రాండ్ కాకతీయలో ఈ తరగతులు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు.

శనివారం ఉదయం 10గంటలకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శాసనసభ్యులనుద్దేశించి కీలకోపన్యాసం చేయనున్నారు. 'ఆధునిక కాలంలో మారుతున్న శాసనసభ్యులు పాత్ర – ఓ సంక్లిష్టమైన పంథా' అనే అంశంపై వెంకయ్య నాయుడు ప్రసంగించనున్నారు. ఆధునిక యుగంలో ఎమ్మెల్యేల పాత్ర, సభలోపల,వెలువల నైతిక విలువలు అనే అంశాలపై వీరంతా కీలకోపన్యాసాలు చేయనున్నారు.

ఇక శాసన వ్యవస్ధలో కమిటీల పాత్ర-వాటి పనితీరుపై మైనార్టీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, సుపరిపాలనకు ఊతమిచ్చే దిశగా కదిలేందుకు ఎలా ఉండాలనే దానిపై జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌ విలువైన సూచనలిస్తారని ఏపీ అసెంబ్లీ వర్గాలంటున్నాయి. ప్రభుత్వ పద్దుల పరిశీలన సమయంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎలాంటి నిఘా పెట్టాలన్న అంశంపై మాజీ కాగ్ వినయ్ రాయ్ ప్రసంగించనున్నారు.

అయితే బాబు బడిలో.. ఎంతో మంది ఎమ్మెల్యే అబ్బాయిలు .. శ్రద్దగా పాఠాలు .. విని టిడిపిలో ర్యాంకు తెచ్చుకుంటారో చూడాలి. ఇదే సమయంలో మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి నారాయణ కూడా ఉంటే బాగుండేదని టీడీపీ సీనియర్ నేతలు అంటున్నారు. అంటే ఆయనకు నారాయణ కాలేజీలు, స్కూల్ ఉన్నాయి కదా.. ఎమ్మెల్యే పిల్లలకు ఎలా పాఠాలు చెప్పాలో బాగా తెలుసునని.. టీడీపీ సినియర్ నేతలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles