కెసిఆర్ ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అందరినీ సంతోషంతో ముంచెత్తాయి. సంబరాలు చేసుకున్నారు, కెసిఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారూ అంటే ఆయన చేసిన హామీలు అలాంటివి. మంత్రివర్గంతో సహా అందరూ ఆ 43 వరాలను కొనియాడారు. అందులో విద్యుత్తు విషయం ఏమీ చెప్పలేదని కొందరన్నారనుకోండి. అయితే అది ప్రభుత్వం చేసే పని కాబట్టి ప్రభుత్వమే చేస్తుంది. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ఆయన అనుకునివుండవచ్చు.
ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న హామీలవి. ఆగస్ట్ 15 నుంచి 18 లక్షల మంది దళితులకు 3 ఎకరాల చొప్పున 54 లక్షల ఎకరాల భూ పంపిణీ చెయ్యాలంటే భూమి సమీకరణకే 76000 కోట్ల రూపాయలవుతుందని అంచనా. దానికి ముందు సర్వే చెయ్యటానికే 600 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ఋణ మాఫీలు, తదితర ప్రకటిత సంక్షేమ పథకాల అమలుకు మరో 30000 కోట్ల రూపాయల ఖర్చవుతుందని లెక్కవస్తోంది.
తెలంగాణా రాష్ట్రంలో ఎంత మిగులు బడ్జెట్ ఉన్నా, కెసిఆర్ ప్రకటించిన కార్యక్రమాలను చెయ్యటానికి భారీగా ఖర్చువుతుంది కాబట్టి అది సాధ్యమౌతుందా లేదా కొందరు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం చూస్తే దీనికి తులతూగేట్టుగా లేదు. వచ్చే 9 నెలల్లో మహా అయితే 40000 కోట్ల రూపాయల వరకు రావొచ్చు. అందువలన మొత్తం ఒకేసారి కాకుండా దశలవారీగా పథకాలను అమలు చేయవచ్చని భావిస్తున్నారు.
ఏది ఏమైనా కెసిఆర్ ఇచ్చిన హామీల ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తానని మరోసారి ప్రకటించటంతో కెసిఆర్ మాటల మీద మరోసారి నమ్మకం ఏర్పడింది. కాకపోతే ప్రభుత్వానికి కత్తిమీద సామే. మూడు సంవత్సరాల వరకు జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుంటే తప్ప వాటన్నిటీ నెరవేర్చటం సాధ్యం కాదు.
మొత్తానికి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ ఖజనాని బార్లా తెరిచి ఖర్చు చెయ్యటానికి సిద్ధపడటం నిజంగా శ్లాఘనీయమే. సరే, ఇవి మాటలే కదా చేతల వరకు వచ్చే వరకు చూద్దాం, అంతంత ఖర్చులు చెయ్యటమంటే సాధ్యమైన పనేనా, ఆ సమయంలో ఏదో వంక వెతుక్కుంటారులే అనేవాళ్ళు లేకపోలేదు. కానీ ఒక మంచి పనికి తలపెట్టినప్పుడు మంచి జరుగుతుందనే ఆశిద్దాం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more