Loss of top hiv researchers with mh 17

top hiv researchers gone with mh 17, hiv aids researchers died in mh !7 plane, 100 researchers died in mh 17 air crash, malaysia mh 17 plane crash

MH 17 crash a global loss as HIV researchers close to solution died in its crash

విమాన ప్రమాదంతో ఎయిడ్స్ చికిత్సకి ముప్పు?

Posted: 07/19/2014 02:45 PM IST
Loss of top hiv researchers with mh 17

ప్రమాదానికి గురైన మలేషియన్ ఎమ్ హెచ్ 17 విమానంతో ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించే చికిత్సను ప్రపంచం పోగొట్టుకుందా అన్న అనుమానాన్ని కలిగిస్తోంది.  ఎందుకంటే ఆ విమానంలో ప్రపంచ విఖ్యాతి గాంచిన పరిశోధకుడు, ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సోసైటీ మాజీ అధ్యక్షుడు జోఎప్ లాంగే నేతృత్వంలో ఒక బృందం ఆస్ట్రేలియాలో మెల్ బోర్న్ లో జరిగే 2014 ఎయిడ్స్ సమావేశం లో పాల్గొనటానికి అందులో ప్రయాణం చేస్తున్నారు.

నిజానికి ఎంతమంది వైద్యులను మానవాళి పోగొట్టుకుందో తెలియదు కాని సిడ్నీలోని డెలిగేట్స్ కి అందిన ఇమెయిల్స్ వలన 100 మంది వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

కెనడాకి చెందిన పరిశోధకుడు ట్రోవర స్ట్రాట్టన్ మాట్లాడుతూ, ఆ పరిశోధకులు ఎయిడ్స్ నిర్మూలనను సాధించటానికి చాలా దగ్గర్లోకి వెళ్ళారని, ఏమో వాళ్ళు ఆ వ్యాక్సిన్ ని ఆ విమానంలో పట్టుకెళ్తున్నారేమో కూడా అని అన్నారు.  ఆ బృందంలో ఎంతోకాలంగా ఎయిడ్స్ మీద పరిశోధన చేస్తున్నవారున్నారని అన్నారు.   అసలు ఎంత శ్రమ, కృషి చేసిన తర్వాత లభించిన ఫలాలు ఆ విమానంలో నాశనమయ్యాయో అంచనా వెయ్యలేమని కూడా ఆయన బాధను వ్యక్తం చేసారు.

మోనాష్ ఇమ్యూనాలజీ అండ్ స్టెమ్ సెల్ ల్యాబొరేటరీస్ డైరక్టర్ ప్రొఫెసర్ రిచర్డ్ బాయిడ్ మాట్లాడుతూ, కొందరు గొప్ప హెఐవి లీడర్లు ఆ విమానంలో ఉన్నారని, ఏ రంగంలోనైనా అందులోని లీడర్ పోయినట్లైతే అది ఎవరూ తీర్చలేని లోటవుతుందని, దాని ప్రభావం మొత్తం మానవాళిమీదనే పడుతుందని అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా పేరెన్న గొప్ప పరిశోధకులు, యువ పరిశోధకులను పోగొట్టుకోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు.  

ఆస్ట్రేలియాకు చెందిన హెచ్ ఐ వి పరిశోధకుడు క్లైవ్ ఆస్పిని కూడా, జీవితమంతా పరిశోధనలో వెచ్చించిన గొప్ప శాస్త్రజ్ఞలను పోగొట్టుకున్నామంటూ వేదనను వ్యక్తపరచారు. గురువారంనాడు ఆమ్ స్టైర్డమ్ షిఫోల్ విమానాశ్రయం నుంచి బయలు దేరి ఉక్రైన్ సరిహద్దులో అగ్నిజ్వాలలకు ఆహుతైన మలేషియా విమానంలో మొత్తం 298 మంది మృతిచెందారని మలేషియన్ ఎయిర్ లైన్స్ శుక్రవారం ప్రకటించింది.  అందులో 283 మంది ప్రయాణీకులు, 15 మంది విమాన సిబ్బంది ఉన్నారని ఎయిర్ లైన్స్ అధికారులు చెప్తున్నారు.  

కానీ అందులో ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధితో పోరాడే 100 మంది శాస్త్రవేత్త సైనికులు మృతి చెందారని, అందువలన జరిగిన నష్టం కేవలం వారి కుటుంబీకులే కాదు, యావత్ప్రపంచానికేనని తెలిసి మానవాళంతా ఆ బాధను పంచుకుంటోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles