Kcr adamant on fees reimbursement

KCR Adamant on Fees Reimbursement, Fees Reimbursement in Telangana, Nativity Telangana rules, Eligibility criteria for Fees Reimbursement, Father born before 1956 for nativity in Telangana

KCR Adamant on Fees Reimbursement scheme implementation

ఒక్కసారి కమిటయ్యానంటే... అంటున్న కెసిఆర్

Posted: 07/19/2014 04:19 PM IST
Kcr adamant on fees reimbursement

ఒక్కసారి కమిటయ్యానంటే నా మాట నేనే వినను అన్న పోకిరి సినిమా డైలాగ్ ని గుర్తుచేసుకుంటున్నారు ఆంధ్ర ప్రదేశ్ పాలకులు.  

స్థానికతను గుర్తించటానికి 1956 కటాఫ్ డేట్ అని తెగేసి చెప్పిన కెసిఆర్ తన పట్టు వదలటం లేదు.  తెలంగాణాలో ఫీజ్ రియంబర్స్ మెంట్ పథకంలోకి రావాలంటే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు 1956 ముందు తెలంగాణాలో పుట్టివుండాలన్నది కెసిఆర్ శాసనం.  దీని మీద ఎవరి దగ్గర్నుంచి ఎన్ని ప్రతిఘటనలు వచ్చినా కెసిఆర్ ప్రకటన చెక్కు చెదరని శిలాశాసనం లా తయారైంది.

దీనితో ఎందరో విద్యార్థులకు ఈ పథకం కింది రియంబర్స్ మెంట్ లభించదు కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ నాయకుల దగ్గర్నుంచి విమర్శలు వస్తున్నాయి.  కానీ కెసిఆర్ దేన్నీ పట్టించుకోవటం లేదు సరిగదా మీ పిల్లలకు మీరు ఫీజు కట్టుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు.  తెలంగాణా బిడ్డలకు అన్యాయం జరగనివ్వం.  అవసరమైతే కఠిన నిర్ణయమైనా విద్యాసంవత్సరాన్ని పొడిగిస్తాం కానీ తెలంగాణా విద్యార్థులు కానివాళ్లకి ఫీజు రియంబర్స్ మెంట్ ఉండదని కెసిఆర్ కచ్చితత్వంతో కూడిన స్వరంలో చెప్తున్నారు.  

ఒకసారి కమిట్ అయ్యారు కాబట్టి ఆయన మరో మాట కానీ ఆలోచనకానీ లేకుండా ఆ పథకంలో 1956 కటాఫ్ డేట్ ని అమలు పరచటానికే సంసిద్ధం చేస్తున్నారు.  కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళతో స్థానికతను గుర్తించటానికి కావలసిన పత్రాల జాబితాను కూడా తయారు చేయిస్తున్నారాయన.  

దటీజ్ కెసిఆర్! అనిపించుకుంటున్నారు.

-SriJa

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles