Old city vendors work hard for others

old city vendors during ramjan, old city unlicensed money lenders, vendors do hard work for lenders, money lenders benefit with ramjan sales

Old City vendors work hard for others like unlicensed lenders who charge exorbitant rate of interest

పాతబస్తీలో సొమ్మొకరిది, శ్రమొకరిది

Posted: 07/19/2014 04:10 PM IST
Old city vendors work hard for others

రంజాన్ పర్వదినాల్లో పాత బస్తీలో చూస్తే దుకాణాలు, రోడ్ల మీద బండ్ల మీద వస్తువులు అన్నీ కళకళ్ళాడుతూ కనిపిస్తాయి.  పొద్దుటి నుంచి చాలా రాత్రయేవరకు అమ్మకాలు జరుగుతూనేవుంటాయి.  రంజాన్ షాపింగ్ కి వచ్చే జనాలతో కిటకిటలాడుతూ వ్యాపారులు తీరిక లేకుండా కూడా కనిపిస్తారు.  ఊఁ వ్యాపారం జోరుగా సాగుతోందనిపిస్తుంది చూడగానే.  

కానీ లోతుగా పరిశీలించి చూస్తే వాళ్ళు పడే శ్రమంతా మరొకరి దోచిపెట్టటానికే అని అర్థమౌతుంది.  అక్కడ వ్యాపారులు పెట్టుబడి కోసం తీసుకునేది అనుమతులు లేని వడ్డీ వ్యాపారుల దగ్గర.  పాత బస్తీలో ఎప్పుడూ ఉండే 5000 మంది వ్యాపారులకు తోడుగా మరో 6000 మంది రంజాన్ సందర్భంగా కాసిన్ని కాసులు పండించుకుందామన్న ఆశతో వస్తారు.  అయితే వాళ్ళలో రూ.1000 నుంచి రూ. 20000 వరకు వడ్డీకి తీసుకుని పెట్టుకునేవారే ఎక్కువమంది వుంటారు.  

కొంతమందిని అదృష్టం వరిస్తుంది, కొంతమంది అనుకున్నంత వ్యాపారం చెయ్యలేకపోతారు.  కానీ వాళ్ళ వెనకనున్న వడ్డీ వ్యాపారి మాత్రం ఎప్పుడూ లాభంలోనే ఉంటాడు.  పండ్లు, ఎండు పండ్ల వ్యాపారం ఈ సీజన్ లో బాగా నడుస్తుందనన ఉద్దేశ్యంతో ఆ వ్యాపారులు పెట్టుబడికోసం అప్పు తీసుకుంటారా వడ్డీ వ్యాపారుల దగ్గర.  ఆ వ్యాపారులకు అందుకు తగ్గ అనుమతులుండవు పాన్ బ్రోకర్స్ దగ్గరున్నట్లు.  చెప్పిన సమయానికి డబ్బు వాపసు కట్టవలసివుంటుంది.  అలా చెయ్యని పక్షంలో హెచ్చరికలు, బెదిరింపులు, కుటుంబ సభ్యుల మీద వేధింపులు, చివరకు చెయిచేసుకోవటం వరకు వస్తుంది కాబట్టి ఎలాగోలా ఆ డబ్బు తిరిగివ్వటానికే చూస్తారు ఆ బీద వ్యాపారులు.  

44 సంవత్సరాల మొహమ్మద్ అమ్జాద్ హుస్సైన్ ఏడీ బజార్ లో మెకానిక్.  అతను 5 లక్షల రూపాయలను వివిధ చిన్న వ్యాపారులకు వడ్డీకి తిప్పుతున్నాడని తెలిసి పోలీసులు అరెస్ట్ చేసారు.  వడ్డీ రేటెంతో తెలిస్తే గుండెలు బాదుకోవటమే జరుగుతుంది.  5 శాతం.  సంవత్సరానికి కాదని తెలుస్తూనేవుంది కానీ నెలకి కూడా కాదు రోజుకి.  

అతను చేసిన వడ్డీ వ్యాపారం ఏ విధంగా సాగిందో అరెస్ట్ చేసిన పోలీసుల వలన తెలిసింది.  ఈ వడ్డీ వ్యాపారులు గుండాలను ఉపయోగించి వసూళ్ళ కోసం వేధిస్తున్నారని కొంత మంది ఆటోడ్రైవర్లు చేసిన ఫిర్యాదుల వలన పోలీసులు  తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేసారు.  ఆ వడ్డీవ్యాపారులు బండి పేపర్లే కాకుండా బండి ని కూడా తమ దగ్గర పెట్టుకుని వాళ్ళు డబ్బు సంపాదించి కట్టలేకుండా కూడా చేస్తారట.  

వందరోజుల్లో తిరిగివ్వవలసిన ఆ ఋణంలో వడ్డీని ముందుగానే తగ్గించి చేతికిస్తారు.  ఇవ్వాల్సిన సమయానికి తిరిగివ్వకపోతే అప్పు పెరిగిపోతుంది.  ఎక్కడా డాక్యుమెంట్లలో దొరకరు వాళ్ళు.  కానీ అంచనాల ప్రకారం వాళ్ళ వ్యాపారం కోట్లల్లో నడుస్తోంది.  స్థానికులు పొరుగువాళ్ళకే వాళ్ళు డబ్బు అప్పిచ్చేది.  కానీ వాళ్ళు అటువంటి సెంటిమెంట్లేమీ పెట్టుకోరు.

అయితే తెలిసి తెలిసి వాళ్ళ చేతికి ఎందుకు చిక్కుతారు, ఆ ఊబిలో ఎందుకు పడతారని చూస్తే, బ్యాంక్ లోంచి అప్పు తీసుకోవటం అంత సులభం కాదు.  ఎన్నో నియమాలు నిబంధనలు.  వీళ్ళు ఎంత కర్కోటకులైనా అవసరం పడ్డప్పుడు ఆ సమయంలో డబ్బిచ్చి ఆదుకుంటారు.   ఎందుకంటే వసూలు చెయ్యటం కూడా వాళ్ళకి తెలిసిన విద్యే కాబట్టి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles