Phone app to assist in traffic jam

phone app to assist in traffic jam, traffic jam hurdles clearing app, spain researchers invent app to help in traffic jams

Phone app to assist in traffic jam developed by researchers in University of Granada in Spain

ట్రాఫిక్ జామ్ లోంచి బయటపడేసే ఫోన్ యాప్

Posted: 07/21/2014 12:15 PM IST
Phone app to assist in traffic jam

సెల్ ఫోన్ వాడకం, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరిగిన తర్వాత అప్లికేషన్స్ వాడకం కూడా బాగా పెరిగింది.  తాజాగా నగరాల్లో ట్రాఫిక్ జామ్ నుంచి వాహనచోదకులను బయటపడేసే ఫోన్ యాప్ ని స్పెయిన్ లోని యూనివర్శిటీ ఆఫ్ గ్రానడా లోని పరిశోదకులు అభివృద్ది చేసానని చెప్తున్నారు.  ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని కూడా అంటున్నారు. అందువలన ట్రాఫిక్ జామ్ బాధితులు దీన్ని విరివిగా ఉపయోగించి లబ్ధిపొందవచ్చని వాళ్ళు అంటున్నారు.  దీన్ని ఇన్ స్టాల్ చెయ్యటం సులభం, బ్లూటూత్ తో ఉపయోగించటానికి వీలవుతుందని కూడా పరిశోధకులు అంటున్నారు.

ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ ల విషయంలో ఉపయోగిస్తున్న విధానం ఖర్చుతో కూడుకున్నదే కాకుండా అది కేవలం నగరాలలో ముఖ్యమైన మార్గాలలో మాత్రమే వర్తిస్తోంది.  కానీ ఈ యాప్ అలా కాకుండా చిన్న చిన్న మార్గాలలో కూడా ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుందంటున్నారు.  

మెకానిజం ఇలా పనిచేస్తుంది-

ఇన్ స్టాల్ చేసిన నోడ్స్, నడుస్తున్న వాహనాలలోని జిపిఎస్ గాడ్జెట్స్, సెల్ ఫోన్స్, హ్యాండ్స్ ఫ్రీ డివైజెస్ లాంటివాటిని గుర్తించి ఆ వివారాలను సెంట్రల్ సెర్వర్ కి చేరుస్తుంది.  దాన్ని డేటా మైనింగ్ ఆల్గొరిదమ్స్ తో సహా గ్రైండర్ ద్వారా ప్రోసెస్ చేసి వినియోగదారులకు వాళ్ళ ముందు ఎంత ట్రాఫిక్ ఉంది, అది ఎంత వేగంతో నడుస్తోంది, ఎంత సేపట్లో క్లియర్ అయ్యే అవకాశం ఉంది అన్నది లెక్కించి చెప్పగలుగుతుంది.  

అయితే వాహనాలలోంచి వెళ్తున్న సిగ్నల్స్ ని పరిగణనలోకి తీసుకుంటుందే కానీ వాటి యజమానుల ప్రైవసీకి ఎటువంటి భంగమూ కలగదని హామీ ఇస్తున్నారు ఈ యాప్ ని తయారు చేసిన పరిశోధకులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles