Dehradun woman duped of rs 1 30 cr by facebook friend

facebook friend, woman cheated, old age home, Dehradun woman duped of Rs 1.30 cr, social networking site Facebook,

A woman was duped of Rs.1.30 crore by a "friend" she had made on Facebook. The woman, Beena Bor Thakur, a resident of Ram Vihar, Delhi, had been assured by her friend that he would get her $1.5 million (about Rs.9 crore) to open an old-age home in Dehradun. Thakur is the wife of an ONGC employee

ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టి కోటి కొట్టేసాడు?

Posted: 07/22/2014 01:53 PM IST
Dehradun woman duped of rs 1 30 cr by facebook friend

‘‘ప్రతి ఫ్రెండ్ అవసరమేరా ’’ ఒక మెబైల్ కంపెనీ యాడ్ గుర్తుకు వస్తుంది. ఇక్కడ ప్రతి ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అవసరమేరా అనుకోని ..కోటి ముపై లక్షలు నష్టపోయాడు. ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్కెస్టు పెట్టి.. కోటీ కొట్టేసాడు. ఇది అక్షరాల సత్యం. అందుకే ఫేస్ బుక్ అకౌంట్ ఉంది కదా అని ఓపెన్ చేస్తే.. ఇలాంటి దెబ్బలే తగులుతాయి. అసలు విషయం ఏమిటంటే.. డెహ్రాడూన్ లో ఓ మహిళ తన పేస్ బుక్ ను ఓపెన్ చేసిన సమయంలో.. ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంది. అంతే ఆ రిక్కెస్ట్ ను లైక్ చేసింది.. కోటి 30 లక్షలు నష్టపోయింది. మోసగాడు.. పన్నీన వలలో.. ఫేస్ బుక్ మహిళ దొరిపోయింది. ఫేస్ బుక్ మోసగాడు ఆడిన డ్రామా ఇదే. వృద్దాశ్రమం ఏర్పాటు చేయడానికి 9 కోట్లు రూపాయలు సాయం చేస్తానంటూ చెప్పి, చివరకు ఆమె వద్ద ఉన్న కోటి 30 లక్షలను లాగేసుకున్నాడు.

డెహ్రాడూన్ లోని రాం విహార్ ప్రాంతానికి చెందిన బీనా బోర్ ఠాకూర్ అనే మహిళకు ఫేస్ బుక్ ఫ్రెండ్.. ముందుగా తాను 9 కోట్లు ఇవ్వాలంటే.. ఓ పన్ను చెల్లించాలని చెప్పాడు. ఫ్రెండ్ మాటలు నమ్మిన ఆమె ఫేస్ బుక్ లో ఫేస్ చూసి .. అతను చెప్పిన అన్నీ బ్యాంకుల్లో కోటి 30 కోట్లు వేయటం జరిగింది. ఫెస్ బుక్ ఫ్రెండ్ చేసిన మోసం డబ్బులు చేతినుండి అతడి ఖాతాలోకి వెళ్లిన తరువాత గానీ తెలియలేదు. పూర్తిగా మోసపోయానని, వెంటనే పోలీసులకు ఫేస్ బుక్ ఫ్రెండ్ పై ఫిర్యాదు చేయటం జరిగింది.

గత సంవత్సరం నవంబర్ నెలలో ఠాకూర్ కు పేస్ బుక్ ద్వారా రిచర్డ్ ఆండర్సన్ అనే వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఆమె కు ఫ్రెండ్ అయ్యాడు. దీంతో అప్పటి నుండి ఇద్దరి మద్య ఫోన్ లో మాట్లాడుకోవటం, చాటింగ్ చేసుకోవటం జరుగుతున్న సమయంలో భారత దేశంలోని ప్రజలకు సేవ చేయాలని అతను చెప్పటం, ప్రజలకు సేవ చేసే దాని పై ఇద్దరి మద్య లోతుగా చర్చలు జరగటం, చివరకు వృద్దాశ్రమం పై మనసుపడి.. ఇద్దరు ఓకే చేసుకున్నారు. వృద్దాశ్రమం ఏర్పాటుకు 9 కోట్లు ఇస్తానని చెప్పటం జరిగింది. అంతేకాకుండా డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ రౌతెలా మాట్లాడినట్లు నటించి, ఆతరువాత రిజర్వు బ్యాంకులోని విదేవీ మారకద్రవ్య విభాగం నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి, మీకు 9 కోట్ల మొత్తం వచ్చిందని, అందుకు కొంత పన్న చెల్లించి ఆ 9 కోట్లు తీసుకోవాలని సుతిమెత్తగా చెప్పి , ఫోన్ పెట్టేశాడు.

ఆమె ఆశపడిందో, లేక సేవ చేయలనుకుందో తెలియదు గానీ.. మొత్తం మీద ఫేస్ బుక్ ఫ్రెండ్ చెప్పిన 25 బ్యాంకు ఖాతాల్లో 1.30 లక్ష డిపాజిట్ చేసి చేతులు కాల్చుకుంది. దీంతో పోలీసులు 420 కేసు నమోదు చేసి, అతని కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఆమె డిపాజిట్ ఖాతలు.. చాలా వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటకలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ ఓకే చేస్తే.. ఇలా నష్టపోవటం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఫేస్ బుకల్ లో ఫేస్ లేని ఫ్రెండ్ చేసిన మోసం అక్షరాల కోటి ముపై లక్షలు. ఈమె కు పోలీసులు న్యాయం చేస్తారో లేదో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles