Movie artist lakshmi files complaint on man for cheating

Junior artist, cheating, Jubilee Hills mla Gopinath, vijay kumar, lakshmi, complaint, mla brother, krishna nagar, police case, movie artist lakhsmi, 40 thousand .

movie artist lakshmi files complaint on man for cheating

ఆర్టిస్ట్ లక్ష్మీతో..ఎమ్మెల్యే తమ్ముడిగా తప్పు చేశాడు?

Posted: 07/22/2014 12:15 PM IST
Movie artist lakshmi files complaint on man for cheating

మోసం అనేది మనుషుల మద్యనే తిరుగుతుంటుంది. దానికి నచ్చినప్పుడు ఎవరో ఒకరు.. మోసానికి బలికాల్సిందే. ఆశతో, ప్రేమతో, డబ్బుతో, కక్షతో, ఇలా రకరకాలుగా మనుషులు.. ‘‘మనిషి చేతిలో ’’ మోసపోతూనే ఉంటాడు. మోసపోయినోడు.. బాధపడతాడు..!! మోసం చేసినోడు.. ఆనందపడతాడు.. !!! అయినా తెల్లవారితో చాలు.. మనకు నిత్యం మోసాలు కళ్లముందే కనిస్తాయి. అలాంటి మోసం ఒకటి.. హైదరబాద్ శ్రీకృష్ణనగర్ లో జరిగింది. కృష్ణ నగర్ అంటేనే.. సినిమా వాళ్లు కు పెట్టింది పేరు. సెలబ్రీటిల నుండి.. సినీ సెట్ లో బాయ్ వరకు ఇక్కడే ఉంటారు. మోసాలు కూడా ఇక్కడే బాగా జరుగుతాయి. సినిమా పై ఆశ పెంచుకున్న ప్రతి ఒక్కరు .. కృష్ణ నగర్ కు రావాల్సింది.

అయితే ఇలాగే.. జూనియర్ ఆర్టీస్ట్ లక్ష్మీ, సినిమా ఛాన్స్ ల కోసం చకోర పక్షి మాదిరి ఎదురు చూస్తున్న సమయంలో.. ఎమ్మెల్యే తమ్ముడిగా.. విజయ్ కుమార్ కృష్ణ నగర్ లో తిరుగుతూ.. లక్ష్మీ కి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం కొంచెం ముదిరి .. లక్ష్మీ మనసులో మాటను.. ఎమ్మెల్యే తమ్ముడు విజయ్ కుమార్ కు చెప్పటం జరిగింది. అసలే మనోడు.. కొద్దిరోజులుగా.. జూబ్లీహిల్స్ లోని మాగంటి గోపీనాథ్ కార్యాలయం వద్ద అటు ఇటూ .. తిరుగుతు ఎమ్మెల్యే తమ్ముడిగా .. అందరిని నమ్మించాడు. దీంతో ఆర్టిస్ట్ లక్ష్మీ నమ్మి.. సినిమా ఛాన్స్ పై ఆశల పందిరి కట్టుకుంది.

అంతే ఆశను అవకాశంగా చేసుకున్న ఎమ్మెల్యే తమ్ముడు విజయ్ కుమార్ , ఆర్టిస్ట్ లక్ష్మీకి .. ‘‘నాకు లక్ష్మీని( డబ్బులు) ఇస్తే ’’ నీకు సినిమా ఛాన్స్ ఖాయం గట్టిగా చెప్పటంతో.. లక్ష్మీ సినిమా మూవీ ఛాన్స్ కోసం లొంగిపోయి 40 వేలు ఇవ్వటం జరిగింది. అంతే 40 వేలు చేతిలో పడగానే.. ఎమ్మెల్యే తమ్ముడిగా.. వేసిన వేషం తీసి.. కృష్ణ నగర్ నుండి కనిపించకుండా పోయాడు.

‘‘వస్తుంది.. వస్తుంది.. నాకు సినిమా ఛాన్స్ అని .. ఆర్టిస్ట్ లక్ష్మీ.. నెల రోజుల పాటు.. ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోని అందంగా తయారైంది. ఇక చివరికు .. ఫెయిర్ అండ్ లవ్లీ కొనడానికి పైసల్ అయిపోవటంతో.., అసలు సినిమా ఛాన్స్ ఏమైందని విషయం ఆరా తీస్తే.. మేకప్ తీసిన ముఖం రంగు బయట పడింది. దీంతో ఆర్టీస్ట్ లక్ష్మీ లబోదిబో మంటూ.. పోలీసులను కలిసి జరిగిన విషయం చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. నిందితుడు విజయ్ కుమార్ కోసం గాలింపు జరుగుతోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles