ప్రస్తుతమున్న జనాభాకి మూడు రెట్లకు సరిపోయేటట్టుగా- అంటే 30 మిలియన్ జనాభా కోసం హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తయారౌతోంది అంటే జనాభా మరో మూడురెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హైద్రాబాద్ చివర్లు అనుకునే ఎల్ బి నగర్, ఉప్పల్, కాప్రా, కూకట్ పల్లి ప్రాంతాలను దాటి హైద్రాబాద్ పరివృత్తం మరింత విస్తరించేట్టుగా గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ చేస్తోంది. అయితే మాస్టర్ ప్లాన్ ని ఏ నగరం నుంచి కాపీ చెయ్యకుండా అధ్యయనం చేసి ముఖ్యమైన, ముఖ్యంకాని ప్రాంతాలను గుర్తించి దాని మీద పనిచెయ్యటానికి కన్సల్టెంట్ల కోసం టెండర్లను పిలుస్తున్నారు.
హైద్రాబాద్ చాలా శీఘ్రంగా అభివృద్ధి చెందుతున్న నగరం. హైద్రాబాద్ ప్రస్తుతం విస్తరించి వున్న క్షేత్రానికి నాలుగు రెట్లు పెంచటానికి మాస్టర్ ప్లాన్ తయారు చెయ్యాలన్నది సంకల్పం. ఆ విస్తరణ ప్లానంతా పూర్తవటానికి రెండు దశాబ్దాలు పట్టవచ్చని అంచనా.
మాస్టర్ ప్లాన్ లో పరిశ్రమలకు, నివాసాలకు, వ్యాపార వాణిజ్యాలకు, ఇంకా ఇతర వర్గాలకు భూమిని విభజించటం జరుగుతుంది. అందులో రోడ్లు, పార్కులు, విద్యాలయాలు, వినోదాలకు కేటాయింపులుంటాయి. మురుగు నీరు, చెత్త డిస్పోజల్, ఆరోగ్యం, పారిశుభ్రం లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవలసివుంటుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తూ భవన నిర్మాణ నియమాలను కచ్చితంగా అమలుపరచినట్లయితే నగరం ఆ బ్లూ ప్రింట్ ప్రకారం రూపుదిద్దుకుంటుంది.
పాత నగరానికీ కొత్త సొబగులు
హైద్రాబాద్ పాతనగరం కూడా కొత్త అందాలు సంతరించుకునేట్లుగా కెసిఆర్ ప్రభుత్వం యోజనలు చేస్తోంది. అందులో భాగంగా రోడ్డు విస్తరణ పనులు, పాత ప్రాజెక్ట్ లను పునరుద్ధరించే పనులు, భూకబ్జాలను తొలగించటం, ఇంకా ఇమ్లీ బన్ లాంటి బస్ టెర్మినల్స్ ని మరో ఐదిటిని నిర్మించటం కూడా ప్రణాళికలో ఉంది. పాత బస్తీ ఏ విషయంలోనూ కొత్త నగరం మీద ఆధారపడగూడదన్నది- అది విద్యా విషయంలోనే కావొచ్చు, వినోదం కోసమే కావొచ్చు, వైద్యం కోసమే కావొచ్చు కానీ పాత బస్తీ స్వయం సమృద్ధిగా ఉండాలన్నది ఉద్దేశ్యం.
అయితే పాత బస్తీని అభివృద్ధి చేస్తూనే చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించాలన్నది కూడా ప్రణాళికలో ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more