232 extra teeth in teenager extracted

232 extra teeth in teenager extracted, Teenager developed 232 extra teeth, benign tumor in teenager’s mouth

232 extra teeth in teenager extracted by JJ Hospital Varanasi

యువకుడి నోటిలో 232 పళ్ళు

Posted: 07/23/2014 04:19 PM IST
232 extra teeth in teenager extracted

ఆరోగ్యవంతుడైన మనిషి నోటిలో 32 పళ్ళుంటాయి కదా.  కానీ ఒక యువకుడి నోటిలో మరో 232 పళ్ళు ఎక్కువుంటే డాక్టర్లు వాటిని విజయవంతంగా పీకివేసారు.  అయితే అవన్నీ అదృష్టవశాత్తూ నోరంతా వ్యాపించి లేవు.  

కేసు వివరాలలోకి వెళ్తే, ఉత్తర్ ప్రదేశ్ బుల్ధానాలో పదవ తరగతి చదువుతున్న 17 సంవత్సరాల విద్యార్థి ఆషిక్ గవాయ్ కుడి చెంప విపరీతంగా వాచిపోతూ కనిపించింది.  దానితో అతన్ని చికిత్స కోసం వారణాసి లో జెజె హాస్పిటల్ కి తీసుకెళ్ళటం జరిగింది.  వాపుకి కారణమేమిటా అని వైద్యులు పరీక్షిస్తే రోగి నోటిలో కింది పలు వరుసలో పదార్థాలను నమలటానికి పనికి వచ్చే మోలార్ పన్నుదగ్గర బాగా పెరుగుదల కనిపించింది- గోళీ కాయంత.  

దాన్ని శస్త్ర చికిత్సతో తొలగిస్తే అందులో చిన్న చిన్న పళ్ళు వందల సంఖ్యలో ఉన్నాయి.  లెక్కపెడితే 232 ఉన్నాయవి.  ఇటువంటి కేసుని చూడటం ఇదే మొదటిసారి అంటున్నారు డాక్టర్లు.  దంత వైద్య శాఖకి హెడ్ అయిన డాక్టర్ సునందా ధివారే ఈ కేసుని వివరిస్తూ, పెరికివేసిన పళ్ళు 232 కి రావటం చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు.  దీనికి తోడు అతని నోటిలో మోలార్ పన్ను మీద కూడా ఎదుగుదల ఉందన్నారావిడ.  అక్కడో రాయిలా పెరిగిపోయింది.  దాన్ని వేరే పద్ధతిలో ఇతర పళ్ళకు నష్టం కలగని విధంగా తొలగించవలసివుందని డాక్టర్ ధివారే అన్నారు.  

ఈ వ్యాధిని డాక్టర్లు కాంప్లెక్స్ కాంపోజిట్ ఒడాన్టోమా అన్నారు.  ఇది ఒక ప్రాణహాని కలిగించని ట్యూమరని, కానీ ఆహార పదార్థాలను తినటం కష్టమౌతుంది, ముఖం ఆకారం మారిపోతుందని అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles