జరగబోయే ప్రమాదానికి సంబంధించి ముందుగానే సూచనలు వస్తాయా అంటే అది అరుదైన విషయమైనా కొన్ని సందర్భాలలో జరుగుతుంటాయి. ఏదో నష్టం జరగబోతుంటే ముందుగానే మూడ్ ఆఫ్ అవటం, ఆలోచనలు ముసరటం లేదా శకునాలు అని మనం నమ్మేవి మనల్ని ఆ పనిచెయ్యకుండా వారించే ప్రయత్నం చెయ్యటం చేస్తుంటాయి. మొండిగా ముందుకెళ్తే నష్టం జరగటం కూడా చూస్తుంటాం. అలాంటి సంఘటనే ఒకటి ఈ మధ్య జరిగిన మలేషియా విమాన ప్రమాదంలో మృతిచెందిన ఆమ్ స్టర్ డమ్ నివాసి 11 సంవత్సరాల మిగూల్ పాండువినటా విషయంలో జరిగింది.
కొద్ది రోజులుగా "చావంటే ఏమిటి, చనిపోతే ఎక్కడికి పోతారు, చావనేది ఎలా ఉండాలని అందరూ కోరుకుంటారు, నేను చనిపోయిన తర్వాత పూడ్చిపెడితే నా శరీరానికి ఏం జరుగుతుంది, దేవుడి దగ్గరకు పోతాను కాబట్టి నాకు ఎలాంటి బాధా ఉండదు కదా"- ఇలాంటి ప్రశ్నలు వేస్తూ వచ్చిన మిగూల్, విమానం ఎక్కటానికి ముందురోజు రాత్రి తల్లి దగ్గరికెళ్ళి గట్టిగా పట్టుకుని వదిలిపెట్టకుండా కాసేపు అలాగే ఉండిపోయాడు. ప్రయాణాలు చెయ్యటం అలవాటే, పైగా చాలా సరదాగా తిరిగే మిగూల్ తెల్లవారి ప్రయాణం వలన ఉద్వేగంలో ఉన్నాడనుకుంది తల్లి సమీరా కాలెహర్. ఎంతకీ వదిలిపెట్టకుండా ఉండటంతో అతన్ని ఆరాత్రి తన పక్కలోనే పడుకోబెట్టుకుందామె.
మిగూల్, అతని అన్న షాకా బాలి వెళ్ళటానికి మొదటి లెగ్ ప్రయాణంగా మలేషియన్ ఎమ్ హెచ్ 17 లో ఆ రోజు ప్రయాణం చెయ్యటానికి సిద్ధమయ్యారు. వాళ్ల మరో సోదరుడు మైకాకి ఆ విమానంలో సీట్ దొరకనందువలన తరువాతి రోజున బాలికి బయలుదేరుతున్నాడు. కాలెహర్ తన స్నేహితురాలు ఆన్ తో కలిసి ట్రైన్ లో కొడుకులిద్దరినీ విమానాశ్రయానికి తీసుకెళ్ళింది. కాలేజ్ లో టెక్స్ టైల్ ఇంజినీరింగ్ చదివే 19 సంవత్సరాల షాకాని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని తల్లి చెప్పింది. అప్పటివరకు అంతా సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నారు. పిల్లలిద్దరూ తల్లిని కౌగిలించుకుని గుడ్ బై చెప్పి పాస్ పోర్ట్ చెక్ వైపు అడుగులు వేసారు.
అంతలోకే మిగూల్ గిరుక్కున వెనక్కి తిరిగి తల్లి వైపు చేతులు చాస్తూ వచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు.
"నేను మళ్ళీ నిన్ను చూడలేనేమో... ఒక వేళ విమాన ప్రమాదం జరిగితే?" అన్నాడు. ఆ మాటలకు ఉలిక్కిపడి,
"ఛీ ఛీ అలా అనగూడదు. ఏమీ కాదు. అంతా సవ్యంగా జరుగుతుంది" అందామె.
షాకా వచ్చి, "నేను జాగ్రత్తగా చూసుకుంటాలే వాడిక నా పిల్లవాడే" అన్నాడు ఇద్దరినీ సముదాయిస్తూ.
ఇద్దరు పిల్లలూ లోపలికి వెళ్తుంటే చూస్తుండిపోయిందామె. కనుమరుగయ్యేంత వరకు మిగూల్ ఊరికే వెనక్కి తిరిగి చూడటం చేసాడు. ఆ అబ్బాయి ముఖంలో విషాదం తాండవిస్తోందప్పుడు.
ఎమ్ హెచ్ విమానం మధ్యాహ్నం 12.15 కి బయలుదేరింది. దాని షెడ్యూల్డ్ ప్రయాణం 11 గంటల 45 నిమిషాలు. కానీ ఆ విమానం రెండే గంటలు ప్రయాణం చేసింది.......
కాలెహర్ మిగూల్ కి మైకా చేతికిచ్చి పంపుతానని చెప్పిన సాక్స్ ని అప్పుడే కొనటం జరిగింది. ఇంతలో ఫోన్.....
"ఎక్కడున్నావ్?" అని అడుగుతోంది ఆమె స్నేహితురాలు ఆన్. "ప్లేన్ క్రాషయింది" అంటూ గట్టిగా రోదిస్తూ చెప్పిందామె. అంతే! ఇంటికి పరిగెత్తుకుంటూ పోయి సొమ్మసిల్లిందామె.
జరిగిన సంఘటనలన్నిటినీ తిరిగి ఆలోచిస్తుంటే, కంటి ముందే కరిగిపోయిన తన ప్రపంచం ఎందుకలా అయిందన్నది అర్థం కాలేదామెకు. కలలన్నీ ఎలా చెరిగిపోయాయి? షాకా టెక్స్టైల్ ఇంజినీరు అవుతాడని, మిగూల్ రేస్ డ్రైవర్ అవుతాడని వేసుకున్న రంగుల చిత్రపటం దూది పింజెల్లా విడిపోయి గాలిలో కలిసిపోయింది.
అంతకంటే వేదన కలిగించేదేమిటంటే, "మిగూల్ కి జరగబోయేది ఎలా తెలిసిందో కాని తెలిసిపోయింది! నేను వాడి మాట ఎందుకు వినలేదు? వాడి మాటలు వింటే ఇలా జరిగివుండకపోవును కదా!" అని.
ఇంట్యూషన్, ప్రికాగ్నిషన్, ప్రిమోనిషన్ ఇలా ఏ పేరుతో పిలిచినా ఒక్కోసారి జరగబోయే ప్రమాదం మనసులో తెలియని వేదనను నింపుతుంది. వారించే ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని సార్లు కొన్ని పనులను చెయ్యటానికి కూడా కొన్ని దైవ సంకేతాలు అందుతుంటాయి. వాటిని వేకప్ కాల్స్ అని కూడా అనుకోవచ్చు.
హృదయాన్ని కదిలించే ఈ ఉదంతాన్ని వింటే మనకు అనిపించేది ఒకటే. మన చేతిలో ఏమీ లేదు. అందువలన ప్రకృతి లేక దైవం ఇచ్చిన దాన్ని సమ్మతిస్తూ పాజిటివ్ గా తీసుకుంటూ పోవటమే. ఇదే భగవంతుడు మనకిచ్చిన భూమ్మీది పాత్ర అనుకోవాలి!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more