Telangana cm kcr probe housing schemes

Telangana CM KCR, KCR probes housing schemes 2006 to 2014, irregularities in housing schemes, KCR launches one day survey August 1

Telangana CM KCR probe housing schemes, ration cards, pensions, Fees reimbursements and housing schemes

తెలంగాణాలో ఎటుచూసినా కనిపిస్తున్న అక్రమాలు, అవినీతి

Posted: 07/27/2014 10:57 AM IST
Telangana cm kcr probe housing schemes

గృహనిర్మాణ పథకాలలో గత ప్రభుత్వాలు చేసిన అవకతవకల నిగ్గుతేల్చటానికి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కసరత్తులు ప్రారంభించారు.  గృహనిర్మాణం ఒక విషవలయమని వ్యాఖ్యానించిన కెసిఆర్ అందులోని అక్రమాలను వెలికితీయటానికి నడుం కట్టారు.  2006 నుంచి 2014 వరకు గృహనిర్మాణ పథకం కింద ప్రభుత్వపరంగా జరిపిన గృహనిర్మాణాలలోని అవకతవకలను వెలికి తీయటానికి ఆగస్ట్  వ తేదీన ఒకే రోజు 4 లక్షలమంది ఉద్యోగులను నియమించి వాట్ల మీద ఆరాలు తియ్యబోతున్నారు.

2006 నుండి 2014 వరక 22 లక్షల 40 వేల ఇళ్ళు కట్టామని గత ప్రభుత్వాలు చెప్తున్నాయి.  అందులో నిజానిజాలెంత, అక్రమాలెంత, పేదల కోసం కట్టిన నిర్మాణాలలో నిజంగా పేదలకు లబ్ధి ఎంత కలిగింది, ఎన్ని కట్టాల్సివుంది అన్న దానిలో స్పష్ట త లేదని అన్న కెసిఆర్, గృహనిర్మాణ పథకాలలో ప్రక్షాళన జరగకపోతే పేదలు నష్టపోతారని అన్నారు కెసిఆర్.  తెలంగాణా వ్యాప్తంగా ఒకే రోజు సర్వే జరపటం కోసం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డివోలు, తహసీల్దార్లు ఆగస్ట్  న సన్నాహ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు.
కెసిఆర్ ఆదేశాల మేరకు 593 గ్రామాల్లో రేండమ్ చెకింగ్ చెయ్యగా 235 కోట్లరూపాయల దుర్వినియోగం జరిగిందని తెలిసింది.  కాంట్రాక్టర్లు కట్టినట్లుగా చూపించిన 36 వేల ఇళ్ళు వాస్తవానికి కట్టలేదని, వాటి బిల్లుల చెల్లింపులు మాత్రం జరిగిపోయాయని తెలిసింది.

గృహనిర్మాణం కోసం 55400 కోట్ల రూపాయల నిధులు 2008-2009 లో విడుదలయ్యాయని, ఆ సమయంలోనే అక్రమాలు జరిగాయని, ఆ తర్వాత కూడా అది కొనసాగిందని కెసిఆర్ అన్నారు.  ఇళ్ళ నిర్మాణాలు, రేషన్ కార్డ్ లు, ప్రభుత్వ భూముల దుర్వినియోగం, పెన్షన్లు, ఫీజ్ రియంబర్స్ మెంట్ ఒకటేమిటి అన్నిటా అక్రమాలు చోటు చేసుకున్నాయని, అసలైన లబ్ధిదారులను గుర్తించటం అందుకే అవసరమౌతోందని కెసిఆర్ అన్నారు.  

ఎంత మంచి ఆలోచనతో పని మొదలుపెట్టినా విమర్శించేవారు ఎలాగూ విమర్శిస్తారనుకోండి.  సినీ ప్రముఖుల నిర్మాణాలను, ఇతర నివాస గృహాలను నేలకూలుస్తున్న సందర్బంలో వచ్చిన నిరసనలను ఎదుర్కోవటానికి కెసిఆర్ ఇతర నిర్మాణాల జోలికి కూడా పోతున్నారని అనేవారూ ఉన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles