ఇరు రాష్ట్రాల ఉమ్మడి ఎంసెట్ మరితర సెట్ ల కౌన్సిలింగ్ ని ఆగస్ట్ 7 నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా అది ఆంధ్రా విద్యార్థుల కౌన్సిలింగ్ అని దానికి హాజరు కావలసిన అవసరం లేదని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తెలంగాణా విద్యార్థులకు పిలుపునిచ్చారు. అయితే, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో లాగానే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పడు ఇరు రాష్ట్రాలలోనూ కౌన్సిలింగ్, అడ్మిషన్ల నిర్వహణ మండలి బాధ్యతేనని అన్నారు.
వృత్తి విద్యా కోర్సులు ఆగస్ట్ 1 కి ప్రారంభం కావాలని, సీట్లు మిగిలిన పక్షంలో నోటిఫై చేసి మొత్తానికి ఆగస్ట్ 15 కల్లా అన్ని సీట్లనూ భర్తీ చెయ్యవలసివుంటుందని వేణుగోపాల రెడ్డి అన్నారు. ఇది సుప్రీం కోర్టు ఆర్డర్ కాబట్టి దాన్ని ఉల్లంఘించటానికి వీల్లేదని ఆయన అన్నారు.
తెలంగాణా విద్యార్థుల విషయంలో జాప్యం జరిగినా సరే కానీ ఆంధ్రా విద్యార్థులతో కలిసి చదవరాదని, పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని కాదు కానీ, ఒక సంవత్సరంలో పరిష్కరించి ఎవరి దోవ వాళ్ళు చూసుకునేట్టుగా చెయ్యాలని కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంసెట్ అడ్మిషన్లలో జరుగుతున్న ఆలస్యం వలన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని, ఆంధ్ర తెలంగాణా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్లులు ఆందోళన చెందుతున్నారని మండలి ఛైర్మన్ అన్నారు.
ఆగస్ట్ 7 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుందని, ఆగస్ట్ 4 న వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించటంలో జరిగిన జాప్యం గురించి సుప్రీం కోర్టుకి వివరణనీయవలసివుంటుందని, అందుకు పిటిషన్ వేయటం జరుగుతుందని వేణుగోపాల రెడ్డి అన్నారు.
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంసెట్ తో సంబంధం లేకుండా నేరుగా అడ్మిషన్లు చెయ్యటానికి పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. అదే పద్ధతిని తెలంగాణాలో కూడా ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్నది కూడా తెలంగాణా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగోలా ఈ సంవత్సరం ఎంసెట్ అడ్మిషన్లను నిలిపివేసి, ఒక సంవత్సరం నష్టపోయినా, ఈ లోపులో ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం తనదారి తాను చూసుకుంటుంది కాబట్టి ఈ విషయంలో శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ తో సంబంధం తెగిపోతుందని కెసిఆర్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. దానికి ఫీజ్ రియంబర్స్ మెంట్ పీట ముడి కూడా బాగా పనికివస్తోంది.
అలా 10 సంవత్సరాలు ఆంధ్ర, తెలంగాణా విద్యార్థులు కలిసి చదువుకోవలసిన అగత్యం లేకుండా ఒక సంవత్సరంలోనే తేల్చేద్దామమని కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్ సెట్ కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్లు జరిగినట్లయితే, మిగిలిన ఖాళీలను కూడా మరోసారి విద్యార్థులను పిలిచి భర్తీ చేసినట్లయితే, తెలంగాణా విద్యార్థులు హాజరుకాని పక్షంలో నష్టపోయేది వాళ్ళే అన్నదానిలో అనుమానం లేదు. ఇప్పటికే ఎమ్ సెట్ విషయంలో చాలా జాప్యం జరిగిన సందర్భంగా తీరా కౌన్సిలింగ్ మొదలయ్యే సరికి దాన్ని నిషేధించండంటూ కెసిఆర్ ఇచ్చిన పిలుపును తెలంగాణా విద్యార్థులు ఎంతవరకు పాటిస్తారో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎమ్ సెట్ కౌన్సిలింగ్ కి తన అంగీకారాన్ని తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more