Mahindra company introducing rize competition

mahindra company introducing rize competition for indian youths, mahindra rize competition worth 6 crores, mahindra company latest news, mahindra company introducing rize competition, mahindra company in india, indian nri in america companies, mahindra company rize competition, driver less cars in india, solar power plants in india

mahindra company introducing rize competition for indian youths and giving offers worth 6 crores

ఒక ఐడియా ఇవ్వండి.. రూ.6 కోట్లు గెలుచుకోండి!

Posted: 08/01/2014 12:11 PM IST
Mahindra company introducing rize competition

‘‘ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది’’ అనే ప్రకటన గురించి మీరు వినే వుంటారు. ‘‘ఐడియా’’ సంస్థ వారు విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా ఎవరి జీవితాలు ఎలా మారిపోయాయో తెలియదు కానీ.. తాజాగా ఇదే ప్రకటనను అనుసరించుకుని ‘‘మహీంద్రా సంస్థ’’ యువతకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది. యువతలో దాగివున్న అద్భుతమైన ఆలోచనలను వెలికి తీసేందుకు ‘‘రైజ్’’ అనే పేరుతో దేశంలోనే అతిపెద్ద సాంకేతిక పోటీని ఆ సంస్థ నిర్వహిస్తోంది. ఈ పోటీలో ఎవరైతే మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయాన్ని సాధిస్తారో.. వారికి ఆరుకోట్ల వరకు ప్రైజ్ మనీని అందిస్తామని సదరు కంపెనీ ప్రకటనను ప్రకటించింది.

ఇటువంటి పోటీని మహీంద్రా కంపెనీ నిర్వహించడానికి ఒక ముఖ్య ఉద్దేశం కూడా వుంది. ‘‘మేడిన్ ఇండియా’’ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావలనే నేపథ్యంలోనే ఈ ‘‘రైజ్’’ పోటీలను నిర్వహించనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి సృజనాత్మకతను జోడించి.. సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంలో ఇలా చేస్తున్నట్టు సదరు కంపెనీ పేర్కొంది. సాధారణంగా అమెరికాలో ఏటా వందలకొద్దీ ఇంజనీరింగ్ పుట్టుకొస్తున్నాయి. అయితే అందులో దాదాపు 33 శాతం సంస్థల్లో మన భారతీయులే సహవ్యవస్థాపకులుగా వున్నారు. ఆ ఎన్నారైలంతా మన భారతదేశంలో పనిచేస్తే.. అతి తక్కువ కాలంలోనే మన దేశంలో కూడా ప్రపంచపటంలో అగ్నదేశంగా మారుతుందనే ఆశాభావాన్ని మహీంద్రా సంస్థ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశం అభివృద్ధివైపుగా దూసుకుపోతోంది కానీ.. దానికంటే రెట్టింపుగా సమస్యలు పెరిగిపోతున్నాయి. అందులో ముఖ్యంగా విద్యుత్, ట్రాఫిక్ వంటి సమస్యలు మరీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రెండురంగాలను దృష్టిలో పెట్టుకునే ఈ పోటీలను ఏర్పాటు చేసినట్టు సదరు కంపెనీ నిర్వాహకులు స్పష్టం చేశారు. దేశంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ‘‘డ్రైవర్ లెస్ కార్ల’’ను ప్రత్యామ్నాయ మార్గాలను కనుగునేందుకు.. వీలైనంత ఎక్కువమందికి సోలార్ విద్యుత్ ను చేరువ చేసే విధంగా అనువైన పద్ధతులను కనిపెట్టడం కోసమే ప్రతిభ గల యువతను స్వాగతం పలికింది మహీంద్రా సంస్థ.

మరి.. ఎవరైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి వుంటారో.. వారు తమ భవిష్యత్తును ఈ పోటీ ద్వారా మార్చుకోవచ్చు. ఈ పోటీలో పాల్గొనేందుకు http://www.sparktherise.com వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను అప్లై చేసుకోవాల్సి వుంటుంది. ఇందులో ఎంపికైన వారికి ప్రతిదశలోనూ కొంతమేరకు సాయం అందుతుంది. ప్రొజెక్టు ఒక్కో దశకు చేరోకొద్దీ ప్రతి జట్టుకూ అవసరమైన గ్రాంటూ లభిస్తుంది. సో.. ఇంట్రెస్ట్ వున్నవారు వెంటనే దరఖాస్తు చేసుకొని.. మీలో వున్న ఐడియాలను పరీక్షించుకోండి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles