అవును... ఒక చిన్నారి ఏడుపు పెద్దలకు ప్రాణం పోసింది. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ పెద్దలకు ప్రాణం పోసి, దేవతగా అవతారమెత్తింది. ఎవరూలేని నిర్ఘాంతప్రాంతంలో చనిపోతున్న ఆ పెద్దల ప్రాణాలను ఒక చిన్నారి ఏడుపు బతికి బయటపడేలా చేసింది. మహారాష్ట్రలోని మాలిన్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన!
మహారాష్ట్రలోని మాలిన్ గ్రామంలో కొండకు దిగువ భాగాన కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. సుఖంగా కాలం గడుపుతున్న ఆ కుటుంబాల జీవితాల్లో వర్షం రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. వర్షాలు కుండపోతగా కురవడం వల్ల కొండపై వున్న మట్టిదిబ్బలు కరిగి వారి నివాసాలపై పడ్డాయి. దీంతో దాదాపు 40 నివాసాలు ధ్వంసం కాగా.. 51 మంది చనిపోయారు. మరో 150 మంది ఆచూకీ ఇంకాల తెలియరాలేదు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే ఒక ప్రాంతం నుంచి ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం సహాయకచర్యలు చేపట్టిన అధికారులకు వినిపించింది. వెంటనే వారు అక్కడికి చేరుకుని బురదను తొలగించి చూడగా.. ఓ పాపతో సహా తన తల్లి కూడా కనిపించింది. ఆ తల్లి తన చిన్నారికి ఎటువంటి హానీ జరగనీయకుండా రక్షణగా తన శరీరాన్ని ఆ పాపపై కప్పేసిన స్థితిలో వుంది. అధికారులు వారిద్దరినీ బయటికి తీస్తుండగానే.. అక్కడే మరో ఇద్దరు తమకు సహాయం అందిచాల్సిందిగా కేకలు వేశారు. అరుపులు వినిపించిన దిశలో అధికారులు వెళ్లి మట్టిని తొలగించి చూడగా.. అక్కడ ఆ పాప బామ్మ, తాతయ్యలు బయటపడ్డారు.
ఇలా ఈ విధంగా ఆ పాప ఏడుపు తన కుటుంబసభ్యుల ప్రాణాలను కాపాడుకుంది. ఆ చిన్నారి పేరు రుద్ర. వయస్సు కేవలం మూడు నెలలు మాత్రమే. తాను బిడ్డకు పాలు ఇస్తుండగా.. ఒక్కసారిగా మట్టిదిబ్బలు విరిగి ఇంటిపై పడ్డాయని.. ఆ పరిస్థితిలో బయటపడ్డానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదని రుద్ర తల్లి పేర్కొంది. అలాగే రుద్ర బామ్మ శకుంతల మాట్లాడుతూ.. తామె అంతటి ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డామో అర్థం కావడం లేదని పేర్కొంది. ప్రస్తుతం వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more