Ebola fears hit commonwealth games as athlete in sierra leone cyclist

Ebola fears hit,Commonwealth,Games,athlete,speaks,terror,quarantined,contracted,deadly,Ebola,virus

Ebola fears hit commonwealth games as athlete in sierra leone cyclist:Road cyclist Moses Sesay, 32, from Sierra Leone was admitted to a Glasgow hospital last week after feeling unwell and doctors tested him for various conditions, including the deadly Ebola virus.

కామెన్వెల్త్ గేమ్స్ అథ్లెట్ పై ఎబోలా వైరస్ ఎటాక్?

Posted: 08/01/2014 06:48 PM IST
Ebola fears hit commonwealth games as athlete in sierra leone cyclist

అత్యంత వేగంగా వ్యాప్తి చెంది మరణానికి కారణమయ్యే ''ఎబోలా'' అంటువ్యాధి కేసు శుక్రవారం తొలిసారిగా ఆఫ్రికాలో నమోదైంది. దీంతో నైజీరియాలోని ఒక ఆసుపత్రిని మూసివేశారు. ఆ ఆసుపత్రిలోనే ''ఎబోలా'' బాధితుడు ఒకరు మరణించాడు. సియెర్రా లియోన్‌కు చెందిన ప్రధాన ఎబోలా చికిత్సా కేంద్రానికి పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. లిబెరియా దాదాపు సరిహద్దు ప్రాంతాలన్నిటిని మూసివేసింది. బహిరంగ సమావేశాలపై నిషేధం విధించింది. ప్రపంచంలోనే అతి పెద్దది, త్వరితగతిన విస్తృతంగా వ్యాప్తి చెందే ''ఎబోలా'' అంటువ్యాధిని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతున్నాయి.

అంతేకాకుండా తగిన వనరులు లేకపోవడం ప్రధాన సమస్య కాగా, అంటువ్యాధి గురించి అంతకుముందు ఏ మాత్రం అనుభవంలేని ప్రాంతంలో ఇది వ్యాపించడం వలన దానిపై ప్రజలకు దానిపై అవగాహన చాలా తక్కువగా ఉన్నది. కాగా గ్యునియా, లిబెరియా, సియెర్రా లియెన్‌లలో ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి 672 మంది మరణించారు. ఎబోలా వ్యాధిని తొలుత ఫిబ్రవరిలో గుర్తించారు. ఇది సోకిన వ్యక్తిని తగిలిన వెంటనే సంబంధిత వైరస్‌ ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇన్ఫెక్షన్‌తో కూడిన మాంసం తినడం వలన కూడా వ్యాధి సంక్రమిస్తుంది.

దీన్ని నయం చేయడం ఎలాగో తెలియదు. అయితే ప్రాథమిక స్థాయిలోనే దీన్ని గుర్తించినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయానికి దూరంగా ఉండవచ్చు. ఈ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసేందుకు అధికారులు ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ‘‘ఎబోలా’’ ఈ వైరస్ సోకితే చాలు అతి తక్కువ రోజుల్లోనే.. మనిషి ప్రాణాలను తీస్తుంది. ఇలాంటి భయంకరమైన వైరస్ ఆఫ్రికా దేశంలోని ప్రజలను బలితీసుకుంటుంది. ఈ ఎబోలా వైరస్ ఇప్పుడు కామెన్వెల్త్ గేమ్స్ అథ్లెట్ పై ఎటాక్ చేసింది. దీంతో ఖంగారుపడిన అధికారులు అప్రమత్తం అమయ్యారు. ఇలాగే కామెన్వెల్త్ గేమ్స్ అథ్లెట్ లో పాల్గొన్న ఒక క్రీడకారుడికి ‘ఎబోలా వైరస్ ’ సోకిందని అతన్ని నాలుగు రోజుల పాటు ఒక గదిలో నిర్బంధించారు.

Ebola-virus

32 సంవత్సరాల మోసెస్ సేసే అనే క్రీడకారుడికి గత రాత్రి ఎబోల వైరస్ ఉందని వైద్య పరీక్షలు చేయటం జరిగింది. అంతేకాకుండా సైక్లిస్ట్ గ్లోస్గో ఆసుపత్రి నాలుగు రోజులు పాట ఒంటరిగా ఉంచి ఎబోలా వైరస్ ఉందని అనుమానించారు. అయితే మోసెస్ సేసే పై ఎబోలా వైరస్ పరీక్షలు అన్నీ చేసిన తరువాత అతన్ని ఆసుపత్రి నుండి డిస్చార్జి చేయటం జరిగింది. దీంతో అతను రోడ్డు రేసులో పోటిపడినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఎబోలా వైరస్ వలన 90 శాతం మరణ రేటు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాణాంతకంగా వ్యాది కోతులు, చింపాంజీలు, మరియు మానవులు పై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ రక్తం ద్వారా మరియు ఇతర శరీర ద్రవాలు ద్వారా వ్యాప్తి చెందుతుందని డాక్టర్లు గుర్తించారు.

అయితే మోసెస్ సేసే కామెన్వెల్త్ గేమ్స్ అథ్లెట్ నుండి ఇంటికి వెళ్ళటానికి భయపడుతున్నాడు. గేమ్స్ ఆడే వారికి బ్రిటన్ ప్రభుత్వం మూడు నెలల వీసా గడువు ఇవ్వటం జరిగింది. దీంతో అతను ఇంటికి వెళ్లటానికి ఆసక్తి చూపటంలేదు. ఎబోలా వైరస్ సియార్రా లియోన్ Rotifunk Moyamba ప్రాంతం నుండి వస్తుందని ఎవరు అన్నారని మోసేస్ సేస్ చెప్పటం జరిగింది.

అయితే నేను బాగా అలసిపోయి నీరసంగా ఉంటే , అతనికి ఎబోలా వైరస్ వచ్చిందని భావించి, ప్రత్యేక వైద్యులు చాలా పరీక్షలు చేయటం జరిగింది. అంతేకాకుండా అతనికి ప్రత్యేకమైన సూట్లు రెఢీ చేసి ఇవ్వడం జరిగింది. మోసేస్ సేస్ కు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించటంతో.. భయంతో వణికిపోయిటన్లు అతను చెప్పటం జరిగింది. నేను అలసిపోవటంతో.. నాకు ఎబోలా వైరస్ వచ్చిందని భావించి, నాలుగు రోజుల పాటు బంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ebola-virus-hits

ఆ తరువాత నాకు ఎలాంటి వైరస్, జబ్బు లేదని భావించి విడిచిపెట్టారు. దీంతో నేను చాలా భయపడ్డాను. ఇలా నా ఆరోగ్యం భాగుందని తెలిసి వెంటనే లండన్ కు పంపించటం జరిగింది. ఈరోజు నా 32వ పుట్టిన రోజే నేను కామెన్వెల్త్ గేమ్స్ అథ్లెట్ లో పోటీ చేయటం జరిగింది. ఈరేసులో నాతో పాటు 24 మంది పోటీపడ్డారు. అయితే అధికారులు మోసేస్ సేస్ కమిటీ సభ్యులు కలిసి గ్లోస్గా రావటం జరిగింది. గత గురువారం మోసేస్ సేస్ అనారోగ్యంతోనే ప్రారంభ వేడుకకు హాజరయ్యాడు. అంతే ఆ తరువాత రోజు నుండి అనుభవించిన విషయాన్ని చెప్పటం జరిగింది. అందరు వెళుతున్నారు. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. మాకు, పాస్పోర్ట్ లలో మూడు నెలల వీసా కలిగి ఉంది. అందుకే మోసేస్ సేస్ వీసా సమయం అయ్యే వరకు ఇక్కడే ఉండాలని ఉందని చెప్పటం జరిగింది.

మోసేస్ సేస్ మరియు జట్టు, గ్లోస్గాలో అధికారులను , లండన్ లో హై కమిషన్ సంబంధంతో ఆదివారం ముగిసే వేడుకల్లో పాల్గొనటానికి కోరటం జరిగిందని చెప్పారు. అయితే వారు ప్రత్యేక జాగ్రత్తలతో కామెన్వెల్త్ అథ్లెట్ల గ్రామంలోకి తీసుకెళ్లటానికి అన్ని సౌకర్యాలు కలిపించారు.

నాలుగు సంవత్సరాల క్రితం మోసేస్ సేస్ భారతదేశంలోని ఢిల్లీలో జరిగిన కామెన్వెల్త్ గేమ్స్ లో పాల్గాన్నాడు. అది దక్షణ ఆప్రికాలో రైళ్లో ప్రయాణించి రెండోసారి కామెన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్నాడు. అయితే ఎబోలా పై ఉన్నతాధికారులు స్వాట్లాండ్ లో నిర్వహించిన పరీక్షల గురించి చెప్పటానికి నిరాకరించారు.

ఎబోలా వైరస్ వ్యాది లక్షణాలు :

* ఎబోలా వైరస్ వ్యాది కోతులు, గోరిల్లాలు, చింపాంజీలు మరియు మానవులకు ఈ వైరస్ త్వరగా సోకుతుంది.

ఎబోలా వైరస్ సోకిన జంతువులు/మనిషిలో .. రక్తం స్రావాలు, శరీర అవయవాలు ద్రవాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.

ఎబోలా వైరస్ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందటానికి, బాధితుడి యొక్క రక్తం, మూత్రం, లాలాజలం, అతని వాడిన వస్తువులు మరియు వీర్యం ద్వారా మరోకరికి వ్యాది సోకుతుంది.

ఎబోలా వైరస్ కేసుల్లో 90 శాతం ప్రమాదకరమైనవి. కానీ ఈ వైరస్ కు టీకా లేదు మరియు ఎలాంటి చికిత్స లేదు.

ఎబోలా వైరస్ సోకిన బాధితుడిలో.. చర్మం పగుళ్లు రావటం జరుగుతుంది. ఆ బాధితుడు కోసం ప్రత్యేకంగా నార దుస్తులు, మంచం, సూదులు ఊపయోగించాలి.

ఒక వేళ ఎబోలా వైరస్ వ్యాది నుండి కోలుకున్న వ్యక్తి, ఏడు వారాల తరువాత.. అతని వీర్యం ద్వారా అతని భాగస్వామికి ఎబోలా వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ebola-virus-disease-in-world

వైరస్ ప్రమాదం ఎవరికి ఎక్కువుగా ఉంటుంది?

ఒకే సమయంలో వైరస్ ప్రమాదం ఉంటుంది..

ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది.

వ్యాది సోకిన వ్యక్తికి అతి సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యులకు, లేదా ఇతరులకు , పక్కింటి వారికి..

ఎబోలా వైరస్ సోకిన వ్యక్తి మరణించిన బాధితులకు, ఆయా మృతదేహాలకు ప్రేమతో సంతాపం తెలిపిన వారికి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వైరస్ తో చనిపోయిన జంతువులను తిన్న వేటగాళ్లు వచ్చే అవకాశం ఉంది.

ఎబోలా వైరస్ లక్షణాలు మరియు చిహ్నాలు ఏమిటి?

ఎబోలా వైరస్ వ్యాధి సోకిన బాధితుడిలో.. తీవ్రమైన జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, మరియు గొంతు నొప్పి, అతిసారలా వాంతులు కావటం, శరీరం పై దద్దర్లు, మూత్రపిండాలు బలహీనపడటం, మరియు కాలేయం పనిచేయకపోవటం, మరియు అంతర్గత బాగాల్లో రక్తస్రావం కావటం జరుగుతుంది.

ఇలాంటి లక్షణాలు చూపించి 21 రోజుల మద్య వ్యవదిలో.. వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది.

వైద్యుని సంరక్షణలో ఉండాలి?

ఒక ప్రాతం, లేదా ఒక వ్యక్తి ఎబోలా వైరస్ ఉందని అనుమానం వచ్చిన వెంటనే వైద్యుడి సహయం తీసుకోవాలి.

ఎబోలా వైరస్ కు చికిత్స ఏమిటి?

వ్యాధి సోకిన బాధితుడికి ఇంటెన్సివ్ సపోర్టివ్ కేర్ తీసుకోవాలి. వ్యాది తీవ్రతను బట్టి, ఇంట్రావీనస్ బలమైన ద్రవాలు ఇస్తూ ఉండాలి.

అయితే ఈ వైరస్ కు ఖచ్చితమైన చికిత్స లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. వ్యాది నుండి బయటపడే అవకాశం ఉంది.

ఎబోలా వైరస్ ను ఎలా నివారించవచ్చు?

ఎబోలా వైరస్ ను నివారించటానికి ప్రస్తుతం ‘ఏ లైసెన్స్ టీకా ఉంది.’ దీనిపై అనేక పరీక్షలు జరిపారు. కానీ ఇంకా వైరస్ బాధితుడికి ఇచ్చే విధంగా . ఈ టీకా అందుబాటులోకి రాలేదు. ఈ టీకాను వైద్య ఉపయోగం కోసం తీవ్రమైన పరీక్షలు చేస్తున్నారు.

వ్యాది సోకిన ప్రాంతాలలో ప్రయాణం చేయటం సురక్షితమా?

దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం, వ్యాదిసోకిన ప్రాంతాలల్లో ఆంక్షలు పెట్టిన చోట ప్రయాణం చేయకూడదని సిపోర్సు చేసింది. బాధితుల నుండి ప్రయాణికులకు సంక్రమించే వ్యాధిలో చాలా తక్కువ ప్రబావం ఉంటుంది. ఇప్పుడ ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది.

భయంకరమైన వైరస్‌
ఈ ప్రపంచంలో జలుబు, క్షయ వంటి పలు వ్యాధులు వైరస్‌ల వల్ల వస్తాయన్న సంగతి తెలుసుకదా! వీటిలో 'ఎబోలా' అనబడే వైరస్‌ ఎంత ప్రమాదకరమైనదంటే ఇది తన ప్రతాపాన్ని చూపించగలిగే ప్రతి ఐదుగురు మనుషుల్లో నలుగురిని చంపివేయగల్గుతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles