ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫీజ్ రియంబర్స్ మెంట్ విషయంలో విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా తన వైపు నుంచి ఒక అడుగు ముందుకు వేసి, ఫీజ్ రియంబర్స్ మెంటు భారం ఎంత పడ్డా అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58 శాతం భరిస్తుంది, తెలంగాణా ప్రభుత్వం కేవలం 42 శాతం భరిస్తే చాలంటూ చెప్పటంతో 1956 సంవత్సరాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నతెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఇరుకున పడ్డట్టయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
అందుకు కారణాలు-
1) ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటే, ఆంధ్రా విద్యార్థులకు ఫీజు మేమెందుకు కట్టాలి అంటూ వస్తున్న కెసిఆర్ 1956 ముందు నుంచీ ఉన్నవాళ్ళకే స్థానికత అంటూ చేస్తున్న వాదన వీగిపోతుంది.
2) ఆంధ్రా విద్యార్థులను కూడా ఈ పథకంలో మిళితం చేసినట్లవుతుంది.
3) మరో కారణం, ఎందులోనూ ఉమ్మడి ముచ్చటే వద్దంటున్న కెసిఆర్ కి ఒక మెట్టు కిందికి దిగినట్లవుతుంది.
4) ప్రతి విషయంలోనూ చంద్రబాబుతో పోటీ పెట్టుకుని విమర్శిస్తూ వస్తున్న కెసిఆర్ చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే చెప్తారు కానీ మాటల్లో ఎక్కడా తెలంగాణా ప్రతిపక్షం అన్న మాట పొరపాటున కూడా అనరు. అలాంటిది ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటే. చూసారా నేను చిక్కు ముడిని విడదీసి తెలంగాణా విద్యార్థలకు జరుగుతున్న అన్యాయం జాప్యాన్ని నిలువరించాను అని రేపొద్దున్న చంద్రబాబు అనే అవకాశం ఉంది.
5) తెలంగాణాలో ఆంధ్రా అన్న మాట కానీ తెలుగు దేశం పార్టీ కానీ ఉండగూడదన్నది కెసిఆర్ ఆలోచనలా కనిపిస్తోంది కనుక చంద్రబాబుని తెలంగాణా ప్రభుత్వ పాలనలో వేలు పెట్టనివ్వటం అవుతుంది.
6) మీ పిల్లలకు మీరు ఫీజు కట్టుకోండి అంటూ వస్తున్న కెసిఆర్ మాటలు విశాలభావంతో చంద్రబాబు చేసిన ప్రతిపాదనతో చాలా అల్పంగా కనిపించే అవకాశం ఉంది.
7) అధికారంలోకి వస్తూనే తెలంగాణా మొత్తాన్ని తన వ్యూహం ప్రకారం నడిపించాలని చూస్తున్న కెసిఆర్ కి ఇది నిజంగా సమస్యే.
8) ఎప్పటినుంచో సమస్యలను కూర్చుని పరిష్కరించుకుందాం రమ్మని పిలుస్తున్న చంద్రబాబు మాటను పెడచెవిని పెడుతున్న కెసిఆర్ కి ఓటమిని అంగీకరించినట్లవుతుంది.
9) ఎమ్ సెట్ విషయంలో కూడా ఆంధ్రా తెలంగాణా విద్యార్థులను కలవనివ్వకూదనుకుంటున్న కెసిఆర్ వ్యూహం కూడా దీనితో దెబ్బ తింటుంది. ఎందుకంటే దీనితో అది కూడా కొలిక్కి వస్తుంది కాబట్టి.
కానీ రాజకీయ చతురతతో దీన్ని కూడా అధిగమించవచ్చు. తన హృదయవైశాల్యాన్ని కూడా చూపిస్తూ, తెలంగాణా వెనకబడ్డ తెలంగాణా బిడ్డలకు న్యాయం చెయ్యటం కోసం నేను కఠినమైన నిర్ణయాలు తీసుకోదలచుకున్నాను కానీ నాకు ఏ బిడ్డలైనా ఒకటే అని అనగలిగితే మాత్రం గెలుపులో భాగస్వామ్యాన్ని పొందవచ్చు. ఇప్పటికీ ఒప్పుకోకపోతే విద్వేషపూరితంగా కెసిఆర్ కక్షసాధింపు చర్యలను చేపడుతున్నట్లుగా కేంద్రానికి కూడా అర్థమౌతుంది. కెసిఆర్ కి ఈ బలహీనతే బలం కూడా. నేను పోరాడుతున్న మీ కోసమే, మీ భవిష్యత్తు కోసమే, ఆంధ్రోళ్లు ఇట్లా మాట్లాడే చివరకు మనం మీద పెత్తనం చేసింరు. వాళ్లని కాలు పెట్టనివ్వద్దు అని కూడా అనగలుగుతారు.
చివరకు కెసిఆర్ ఏం చేస్తారన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more