Meet bihar teachers who got their b ed before they were born 2014

Cheat and teachers in bihar, Bihar teachers, B.Ed passed, Bihar government school in Saharsa, Bihar government, Cheat and teach Meet Bihar teachers

Cheat and teachers: Meet Bihar teachers who got their B.Ed before they were born:L B Singh, a teacher at a Bihar government school in Saharsa, was born in January 1986. But he got his Bachelor of Education degree in 1979 — seven years before he was born.

పుట్టకముందే బీఈడీ పాసైన టీచర్లు!!

Posted: 08/07/2014 01:20 PM IST
Meet bihar teachers who got their b ed before they were born 2014

బీఈడీ పట్ట సాధించటాలంటే.. తల ప్రాణం తోకలోకి వస్తుంది. అలాంటిది అసలు పుట్టకముందే బీఈడీ పాసైన టీచర్లు మన దేశంలో ఉన్నారు. బీఈడీ పాస్ కావాలంటే.. మీరు బీహార్ వెళ్లితే.. సరి.. మీతో పాటు.. మీకు పుట్టబోయే బిడ్డకు కూడా బీఈడీ సర్టిఫేకేటు ఇస్తారు. ఇక ఎంచెక్కా గవర్మమెంట్ టీచర్ గా ఉద్యోగం పొంది.. పిల్లలకు పాఠాలు చెప్పకపోయినా.. జీతం తీసుకోవచ్చు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. 2012 మార్చి-ఏప్రిల్ మధ్యలో 32,127 మంది ఉపాధ్యాయులను నియమించారు. వారిలో 95 మందికి చెందిన సర్టిఫికెట్లు పరిశీలించి చూడగా ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. వారందరూ తాము పుట్టకముందే బీఈడీ డిగ్రీలు అందుకున్నట్టుగా ఆ పత్రాల్లోని తేదీలు చెబుతున్నాయి.

సహార్సా గ్రామంలో ఉపాధ్యాయుడిగా నియమితుడైన ఎల్బీ సింగ్ అనే వ్యక్తి 1986 జనవరిలో పుట్టగా, అతను బీఈడీ డిగ్రీ 1979లోనే పొందినట్టు సర్టిఫికెట్లు చెబుతున్నాయి. అంటే తను పుట్టడానికి ఏడేళ్ళ ముందే బీఈడీ పూర్తిచేశాడన్నమాట! ఇందుకుమారి అనే యువతిదీ ఇదే పరిస్థితి! మొత్తమ్మీద ఆ రిక్రూట్ మెంట్ లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినవాళ్ళు 3000 మందికి పైగా ఉన్నారని బీహార్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇలాంటీ టీచర్ల వల్ల ఎంత మంది పిల్లల జీవితం నాశనం అయ్యిందో ఊహించుకోండి? ఇలాంటీ వారికి కఠిన శిక్ష వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి నకిలీ టీచర్లు చాలా మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బీహార్ మొత్తం నకిలీ ఉద్యోగులతో నిండిపోయిందని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ప్రభుత్వం వెంటనే నకిలీ ఉద్యోగులను గుర్తించి తగ్గు చర్యలు తీసుకోవాలని బీహార్ ప్రజలు కోరుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles