(Image source from: michael jackson raped james safechuk 100 times)
పాప్ సంగీతాన్ని సరికొత్త ఒరవడితో లోకానికి పరిచయం చేసిన మైకేల్ జాక్సన్ గురించి తెలియనివారు ఎవ్వరుండరు. ఆయన ఆల్బం మార్కెట్లో విడుదలవుతుందంటే చాలు.. రికార్డులు బద్దలవ్వాల్సిందే! సినిమా జగత్తులో ఎంతమంచి పేరు సంపాదించుకున్నాడో... నిజ జీవితంలో కూడా అంతే మంచి వ్యక్తిగా కితాబును దక్కించుకున్నాడు. తన దగ్గర పనిచేస్తున్నవారి నుంచి సినీ ప్రముఖుల దాకా అందరితో కలిసి మెలిసి వుంటాడని అందరు పేర్కొంటుంటారు. అయితే ఇటువంటి లెజండరీ యాక్టర్ పై అత్యాచార ఆరోపణలు రావడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఈ వార్తలు విన్న ఈయన అభిమానులు ఒక్కసారి నివ్వెరపోయారు.
1980లో మైకేల్ తో కలిసి పెప్సీ ప్రకటనలో కనిపించిన సేఫ్ చెక్ జేమ్స్ అనే ఒక వ్యక్తి ఇతనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. తాను బాలుడిగా వున్నప్పుడు జాక్సన్ 100సార్లు అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు చేశాడు. దీనికి సంబంధించి జేమ్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ఫిర్యాదులో తన క్లైంట్ తీవ్ర ఆరోపణలు పేర్కొన్నాడని అతని తరఫు న్యాయవాది వెల్లడించాడు. తన క్లయింట్ జేమ్స్ ను జాక్సన్ చాలాసార్లు అనుభవించారని.. తనతో లైంగిక సంబంధంలో పాల్గొనే సమయంలో కోడ్ భాషను ఉపయోగించేవాడని న్యాయవాదులు చెప్పినట్లు యూఎస్ లోని ఓ ప్రముఖ వెబ్ సైట్ ప్రచురించింది.
అంతేకాదు.. జేమ్స్ ను రహస్యంగా వివాహం చేసుకునేందుకు మైకేల్ ఉంగరాన్ని, మ్యారేజ్ సర్టిఫికెట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడని జేమ్స్ తన ఆరోపణలు ఒక డాక్యుమెంటరీ రూపంలో కోర్టుకు అందించినట్లు సమాచారం! తనపై మైకేల్ చాలాసార్లు అత్యాచారం చేశాడు కాబట్టి దానికి నష్టపరిహారం ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే ఇతను దాదాపు 20 సంవత్సరాల తరువాత... అది కూడా మైకేల్ జాక్సన్ చనిపోయిన ఐదేళ్ల తరువాత జేమ్స్ ఈ విధంగా ఆరోపణలు చేయడంతో కొంతమంది పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 2009 జూన్ లో మైకేల్ ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్న కారణంగా మరణించిన సంగతి తెలిసిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more