T congress mprenuka chowdhury angry on mp kk in rajya sabha

mp renuka chowdary speech in rajya sabha, T congress mp renuka, telangana congress mp renuka, renuka chowdary vs trs mp kk, k keshava rao speech in rajya sabha, tv9 issue in telangana, abntv channels, telangana government, cm kcr angry on tv9 channel, kcr angry on abn channel, telangana state, media channels, kk vs renuka

T Congress MPrenuka chowdhury angry on mp kk in rajya sabha: Telangana Congress MP Renuka Chowdary speech in Rajya Sabha

టివీ9-జ్యోతి కోసం సభలో కేకేను ఉతికిన రేణుకా చౌదరి?

Posted: 08/07/2014 04:41 PM IST
T congress mprenuka chowdhury angry on mp kk in rajya sabha

రెండు నెలలు గడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో టీవీ9- ఏబీఎన్ ఛానల్స్ నిలిపివేసి. ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ పై వాటి పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కేంద్రం చెప్పిన, కోర్టు నోటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్ దిగిరాలేదు. దీంతో ఈరోజు ఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభలో తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్, టీవి9 ఛానల్స్ పై జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు.

ఈ సమయంలో.. రేణుకా చౌదరి ఏబిఎన్ , టీవీ9 ప్రసారాల నిలిపివేత పై సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నారు. ఇంతకీలో టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు కే.కేశవరావు రేణుక వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీంతో సభలోనే కేకేను రేణుక చౌదరి ఉతికిపారేసింది. చానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని రేణుక అన్నారు. కోర్టు ఆదేశాలిచ్చినా, కేంద్రం నోటీసిచ్చినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.

ఈ సమయంలో కేకే రేణుక ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చానళ్ల నిలిపివేత రాష్ట్రానికి సంబంధించిన అంశమని గొడవకు దిగారు. దీంతో ఇద్దరి మద్య మాటల యుద్దం జరిగింది. కేకే మాటలు సభలోని అర్థంగాక ..జుట్టు పీక్కున్నారు.

అయితే ఈ ఇద్దరి మద్య మాటలు హద్దులు దాటిపోవటంతో.. వెంటనే డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ జోక్యం చేసుకుని ప్రసార మాధ్యమాలను అడ్డుకోవడం రాష్ట్ర వ్యవహారం ఎలా అవుతుందని కేకేను ప్రశ్నించారు. కేంద్ర సమాచార ప్రసారాల శాఖకు సంబంధించిన అంశమేనని, రాజ్యసభలో లేవనెత్తడం తప్పులేదని కురియన్ అన్నారు.

దీంతే కేకే ఆవేశంపై.. పానీపురీ నీళ్లుపడటంతో. సైలెంట్ గా నేల చూపులు చూస్తూ కిందకు జారిపోయాడు. రేణుక చౌదరి మరోసారి పెద్దల సభ సాక్షిగా ఫైర్ బ్రాండ్ అనే పేరు ను నిరూపించుకుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles