(Image source from: Ebola virus attacking India)
గతంలో ఎయిడ్స్ వ్యాధి వెలుగుచూసినా కూడా అంతగా భయపడని అమెరికా వంటి అగ్రరాజ్యాలు... ఇప్పుడు ‘‘ఎబోలా’’ వైరస్ పేరెత్తితేనే గజగజ వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఒకసారి సోకిందంటే చాలు.. ప్రాణాలు పోయేంతవరకు విడిచిపెట్టదు. మానవశరీరంలో ప్రవేశించిన అనంతరం.. లోపల వున్న కండరాలను మెల్లగా జీర్ణింపచేసేస్తుంది. రకరకాల వ్యాధులకు గురి ముప్పుతిప్పలు పడేలా చేస్తుంది. ఎంతటి మెరుగైన వైద్యచికిత్సను అందించినా సరే.. ప్రాణాలు పోవడం మాత్రం ఖాయం. ఇప్పటికే ఈ వైరస్ దాదాపు 932 మందిని పొట్టనపెట్టుకుంది.
ఎబోలా వైరస్ సోకిన తమ పౌరులను కాపాడుకోవడం కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. చివరికి ఈ వ్యాధికి చికిత్స లేదని... సోకినవారికి మరణించడం తప్ప మరేదారి లేదని... ప్రస్తుతం ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా వుండాలంటే దూరంగా పారిపోవడమే మంచిదని వైద్యులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు.. ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు వైద్యులు భయపడి పారిపోతున్నారు. ఎందుకంటే.. ఎబోలా సోకిన బాధితులకు చికిత్స అందించిన ఒక వైద్యుడితోపాటు ముగ్గురు నర్సులు కూడా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అంతే.. అప్పటి నుంచి పరుగులు తీస్తూనే వున్నారు.
ఇంతటి ప్రాణాంతకమైన ఈ ఎబోలా వైరస్ ఇప్పుడు మన భారతదేశానికి కూడా సోకే అవకాశాలు చాలా ఎక్కువగానే వున్నాయని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వైరస్ బారినపడి అవస్థలపాలు పడుతున్న రోగులలో మన భారతీయులు కూడా దాదాపు 45మంది దాకా వున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ గణాంకాలు తెలిపింది ఏ సర్వేలో కాదు.. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్ లో పేర్కొన్నారు. వీరందరూ వివిధ పనుల నిమిత్తం విదేశాల్లో వుంటున్నవారు.
ప్రస్తుతం ఎబోలా తాండవమాడుతున్న ముఖ్య దేశాల్లో.. అంటే లైబీరియాలో ఐక్యరాజ్యసమితి సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారిలో 300మంది భారతీయ జవాన్లతోపాటు ఇతరుల పనుల నిమిత్తం దాదాపు 2,700మంది వున్నారు. అలాగే సియోర్రాలియోన్ లో 1200 మంది, గినియాలో 500 మంది, నైజీరియాలో 40వేల మంది భారతీయులు వున్నారు. ఈ దేశాలన్నింటిలోనూ ఎబోలా ప్రభావం చాలా ఎక్కువగానే వుంది. ఈ దేశాల్లో వున్న మన భారతీయులకు గానీ ఈ వ్యాధి సోకి.. వారు గనుక స్వదేశానికి (ఇండియా) వస్తే.. ఇక అంతే సంగతులు! ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకునే కేంద్రం ఈ గణాంకాలను సేకరించింది.
అయితే ఈ మన భారతీయ పౌరులు ఈ వ్యాధి బారిన పడకుండా స్వదేశానికి తిరిగి వస్తే ఎటువంటి సమస్య లేదు కానీ... పొరబాటున వ్యాధి సోకిన తర్వాత ఎవరైనా వస్తే ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్! ఈ నేపథ్యంలోనే ఆరోగ్య మంత్రిత్వ వాఖ ముందుజాగ్రత్త కోసం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఒకవేళ ఈ వ్యాధి మన భారతదేశంలో గనుక ప్రవహిస్తే.. దాని నుంచి బయటపడే మార్గాలను వెదికేపనిలో పడిపోయారు భారతీయ నిపుణులు. ఈ వ్యాధి మన ఇండియాకు రాకూడదనే ఆశిద్దాం!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more