Kapu s should change

kapu caste, munnuru kapu, minister manikyala rao, kapu converts into bc, manikyala rao comments on kapu, caste's in india

minister manikyala rao comments on kapu cast : kapu's should become as good people kapu caste development

కాపుల అభివృద్ధి ఎలా?

Posted: 08/11/2014 01:39 PM IST
Kapu s should change

కాపులు. ఆంధ్రప్రదేశ్ లో ఇదో బలమైన సామాజికవర్గం. ప్రభుత్వాలను శాసించగల స్థాయిలోని వ్యక్తులు చాలామంది ఈ వర్గం నుంచి ఉన్నారు. అనుభవం లేకపోయినా కాపు అనే పేరును వేసుకుని పెద్దయిన వారెందరో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అంతగా ప్రభావం చూపుతుంది కాపు వర్గం. అయితే ఈ వర్గంపై ఎంత మంచి ముద్ర ఉందో అంతే దురభిప్రాయం ఉంది. దాడులు చేసే వారిగా, దుందుడుకు స్వబావులుగా, దయా దర్మం లేకుండా రాజకీయాలు చేసే వారిగా సమాజంలో అపకీర్తి తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ వర్గంలోని చాలామంది ఇప్పటికీ ఆర్ధికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నారు. పేరుకు పెద్ద అయినా.., తాగడానికి గంజి లేదన్నట్లు.., అగ్రవర్ణంగా ముద్ర పడ్డా.., చాలామంది ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు ఎంతో మంచి పేరు తెచ్చకున్న వీరు ఇప్పుడిలా ఎందుకు మాటలు పడుతున్నారు. అసలు కాపులు ఎక్కడి నుంచి వచ్చారు. వారి చరిత్ర, వ్రుత్తి, ప్రస్తుత పరిస్థితులు ఏమిటి ఓ సారి వివరంగా చూద్దాం.

కాపువర్గీయులంటే?

కాపు అనే పేరు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా విన్పించే సామాజికవర్గం. వీరిలో బలిజ, తెలగ, మున్నూరు కాపు, తూర్పు కాపు మరియు ఒంటరి పేర్లతో ఉప కులాలున్నాయి. తెలుగులో కాపు అనే పదానికి అర్ధం కర్షకుడు లేదా రక్షకుడు . వీరిని నాయుడు అనే పేరుతో కూడా పిలుస్తారు, ఆంధ్రలో ఎక్కువగా తీరప్రాంత జిల్లాలు, ఉత్తర తెలంగాణా మరియు రాయలసీమలో కాపులు ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా దక్షిణ భారత దేశం పరిధిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సాలతో పాటు ఇతర రాష్ర్టాల్లో కూడా కాపులున్నారు. వీరి పేర్ల చివర నాయుడు అని పిలవటం జరుగుతుంది.

చరిత్రను చూస్తే వీరు ఇండో ఆర్యన్ జాతికి చెందిన కాంపు వర్గానికి చెందినట్లు ఆధారాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతం నుంచి వేల ఏళ్ళ క్రితం వలస వచ్చి ఇక్కడ స్థిరపడనట్లు తెలుస్తోంది. ఎక్కువగా నదులు, తీర ప్రాంతాల్లో వీరు స్థిరపడ్డారు. నదీ తీర సమీపంలో అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పర్చుకుని జీవనం సాగించినట్లు తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణ డెల్టా, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలో మున్నూరు కాపులు మరియు తెలగలు ఎక్కువగా కనిపిస్తారు. మరొక ఉప కులమైన తెలగల విషయానికొస్తే వీరు ప్రధానంగా ద్రాక్షారామం, శ్రీశైలం, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఉన్నారు. చరిత్ర ప్రకారం ఈ ప్రాంతాలను త్రిలింగ దేశంగా, అక్కడ ఉండే వారిని తెలగలు.., వారు మాట్లాడే బాషను తెలుగుగా పిలవబడింది. అదే కాల క్రమంగా తెలుగు ప్రాంతంగా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాదు మూడవ శతాబ్దంలో క్రుష్ణా, గోదావరి డెల్టా పరిసరాలను కాపులు పాలించినట్లు కూడా ఆధారాలున్నాయి.

కాపుల వృత్తి

కాపులు ప్రధానంగా కర్షక వర్గానికి చెందిన వారు. అయితే వీరిలో ఉన్న ఉప కులాలు ఒక్కొక్కరు ఒక్కో పనికి సంబంధించిన వారున్నారు. వ్యాపారం చేసే వారిని బలిజ అని పిలిచేవారు. అదేవిధంగా సైనిక వ్రుత్తిలో ఉండేవారిని బలిజ నాయుడు అనేవారు. పరిపాలనను చూసుకునే వారిని చిన్న కాపు, పెద్ద కాపు అని, పంటలను కాపాడే వారిని పంట కాపు అని వ్యవహరించేవారు. అయితే వీరు ప్రధానంగా సైనికులుగా, గ్రామ రక్షకులుగా ఆ తర్వాత గ్రామ పెద్దలుగా వ్యవహరించారు. నమ్మకానికి, పెద్దరికానికి మారుపేరుగా కాపులు నిలిచారు.
    
బలమైన వర్గం

రాజులు- రాజ్యాల సమయంలో ప్రజా పాలన కంటే దాడులు, యుద్ధాలే ఎక్కువగా ఉండేవి. ఎవరు ఎప్పుడు ఏ రాజ్యంపై దండెత్తి వస్తారో తెలియని పరిస్థితప్పుడు. అలాంటి సమయంలో రాజ్యాలకు రక్షణగా సైనికులుగా నిలిచింది కాపులే. మొదట్లో వీరు శాంతి కాముకులుగా ఉన్నా.., వ్రుత్తి ధర్మం, శత్రు దాడులను అడ్డుకునేందుకు బలంగా తయారయ్యారు. దీంతో ఆ సమయంలోనే వీరు ఒక బలమైన వర్గంగా పేరుపొందారు. క్రమంగా కాపులు సమాజంలో బలమైన సామాజిక వర్గంగా మారి ఉన్నత స్థానాలను చేరుకున్నారు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే కాపు బలం స్పష్టమవుతోంది. కుల సమీకరణాలు ప్రధానమవుతున్న ఎన్నికల్లో కాపుల మద్దతు లేకుండా గెలవటం, ప్రభుత్వాన్ని నడపటం కలే అవుతుంది. ప్రభుత్వంపై అంత ప్రభావం చూపగల సత్తా వీరికుంది.

విద్య-ఉద్యోగం

సమాజంలో ఉన్నత వర్గంగా ఉండటతో కాపుల్లో చాలామంది విద్యాధికులు ఉన్నారు. ఇరవయ్యవ శతాబ్దం, ఆ తర్వాత విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారిలో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గం వారే. వీరు ప్రధానంగా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ర్టేలియా, న్యూజీలాండ్, మలేషియా, దక్షిణఆఫ్రికా, సింగపూర్, కెనడా, ట్రినిడాడ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, క్యురకావ్, చైనా మరియు మారిషస్ దేశాల్లో స్థిరపడ్డారు. అంతేకాదు విద్యారంగం ఆవశ్యకతను ముందుగానే గుర్తించి పలు విద్యా సంస్థలను ప్రారంభించి ఉన్నత ప్రమాణాలతో విద్యానందిస్తున్నారు. ఎంతోమంది స్వయంగా ఉన్నత పదవుల్లో ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే ఉన్నత కులం అనే ముద్ర పూర్తిగా ఎదగనీయటం లేదు. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల్లో కేవలం 5శాతం మాత్రమే కాపులున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. జనాభా పరంగా చూసినా ఇక్కడ అన్యాయం జరిగినట్లు స్పష్టం అవుతోంది.

రాజకీయాలు
ఆంధ్ర ప్రదేశ్ లో బలమైన సామాజిక వర్గంగా పేరున్న కాపులు రాజకీయాల్లో కూడా ప్రభావం చూపగలరు. వీరి బలం లేకుండా ప్రభుత్వాన్ని నడపటం ఎవరి వల్లా కాదు. అయితే సామాజిక సమీకరణాలకు తగ్గట్టు వీరికి అవకాశాలు మాత్రం లభించటం లేదు. ప్రతి పార్టీ కాపు ఓటు బ్యాంకును కోరుకుంటోంది తప్ప ఆ వర్గం నేతలను మాత్రం పక్కన బెడుతుందన్న వాదన ఉంది. అటు కాపుల్లోని చాలా వర్గాలు, ఉప కులాలు వెనకబడి ఉన్నాయి. అంతేకాకుండా కాపుల్లోని పేదలు ఉన్నత కుల ముద్రతో అభివ్రుద్ధి ఫలాలకు దూరంగా ఉన్నారు. వర్గంలోని అందరూ ధనికులు కాదన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు అయితే.., రాజకీయ చదరంగంలో పావులుగా మారి గెలుపు కోసం వాడుకుంటున్నారు తప్ప వీరి బాగోగులు ఎవరూ పట్టించుకోవటం లేదు.

కాపు-బీసీ బిల్లు

ఇక కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ ఏళ్ళ నుంచి విన్పిస్తున్నా హామీలకు తప్ప అమలుకు నోచుకోలేదు. ఇందుకు కాపుల ఐక్యతా లోపం కూడా కారణంగా చెప్పాలి. కాపులను బీసీల్లో చేర్చితే వీరి దశ మారినట్లేనని చెప్పాలి. ఏళ్ళ తరబడి ఉన్నత వర్గంగా వెనకబడ్డ వీరికి ఇదో చేయూతగా నిలుస్తుంది. ఈ బిల్లు అమలుకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అంతా కలిసి పోరాడాల్సిన అవసరముంది.

ఒకప్పుడు మంచి పేరు తెచ్చకున్న కాపులపై ఇప్పుడు చెడు ముద్ర ఉంది. గతంలో రక్షకులుగా పేరున్న వీరు ఇప్పుడు దుందుడుకు స్వభావులుగా, దాడులు చేసే వారుగా అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. ఇందుకు ప్రదాన కారణంగా చదువును నిర్లక్ష్యం చేయటం, రాజకీయాల్లో పావులుగా మారిపోవటం. ముందుగా చదువు విషయానికొస్తే ఈ సామాజిక వర్గంలో ఎక్కువగా వ్యవసాయం, అనుబంద రంగాలపై ఆధారపడి ఉన్నారు. ఉన్నత వర్గంగా పేరుండటంతో దాన్ని కొనసాగించేందుకు గ్రామాల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అంతేకాకుండా వీరికి రిజర్వేషన్ల లేమి కూడా ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఉన్నత శిఖరాలను అధిరోహించలేకపోతున్నారు. అంతమాత్రాన చదువును నిర్లక్ష్యం చేయకూడదు. విద్యలేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు. నిజంగా చదువు లేకపోతే ప్రస్తత సమాజంలో ఎంత పేరున్నా పనికిరాదన్న విషయం గ్రహించాలి. అందరితో పోటి పడాలి..., అందర్లో ముందుండాలి అనే తపనతో కొనసాగాలి. క్రుషితో నాస్తి దుర్బిక్షం అన్నట్లు, కష్టపడి పనిచేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది.

కాపులపై మాణిక్యాల కామెంట్స్
    
ఏపీ కేబినెట్లో కాపు సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు తన వర్గంపై ఉన్న అపనిందను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. కాపులు దూకుడు స్వభావులుగా, దాడులు చేసే వారిగా అపకీర్తి పాలవుతుండటం కలిచి వేస్తోందన్నారు. ఈ ముద్రను తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాపుల సంఖ్యా బలం, రాజకీయాల్లో వారికున్న ప్రాధాన్యతను వివరించారు. ఏపీలో చిరంజీవి పార్టీతో గతంలో కాపులకు గుర్తింపు వస్తే.., ఆయన తమ్ముడు పవన్ మద్దతుతో ప్రస్తుతం టిడిపి అధికారంలోకి వచ్చిందన్నారు. దీన్నిబట్టే కాపుల ప్రభావం ఏంటో స్పష్టమవుతోందన్నారు. ఇక కాపులను బీసీల్లే చర్చే ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని మాణిక్యాల రావు చెప్పారు.

RK

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : kapu caste  minister manikyala rao  latest telugu news  caste system  

Other Articles