Janasena party president pawan kalyan not announcing his party symbol on august 15

pawan kalyan latest news, pawan kalyan, pawan kalyan janasena party, election commission, election commission of india, pawan kalyan campaign, janasena party symbol, janasena party news, pawan kalyan janasena

janasena party president pawan kalyan not announcing his party symbol on august 15 : tollywood power star and janasena party president pawan kalyan not announcing his party symbol on august 15. Because election commission has not yet registrate the party.

‘‘జనసేన’’ పార్టీపై వెనక్కు తగ్గిన పవన్ కల్యాణ్!

Posted: 08/11/2014 05:09 PM IST
Janasena party president pawan kalyan not announcing his party symbol on august 15

(Image source from: janasena party president pawan kalyan not announcing his party symbol on august 15)

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్... తన పార్టీని మరింత పటిష్టం చేయాలనే భావనతో పావులు కదుపుతున్న విషయం తెలిసిందే! ఒకవైపు సినిమాలతో ‘‘గోపాల గోపాల’’ సినిమాతో బిజీగా వుంటూనే ఆయన తన పార్టీని పటిష్టం చేసే పనిలో తన మెంబర్లతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పార్టీ టీం మెంబర్లు అనధికారిక ప్రకటనలను కూడా జారీ చేశారు.
అయితే ఇప్పుడు తాజాగా ఆయన తన పార్టీ విషయంలో వెనక్కు తగ్గినట్టు కనిపిస్తోంది.

ఇటీవలే పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీకి గుర్తుగా ‘‘పిడికిలి’’ని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాలని అనుకున్నారు. ఈమేరకు ఆ పార్టీ వర్గాలు అనధికారికంగా సమాచారాన్ని కూడా అందించాయి. అయితే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న తాజా నిర్ణయంతో జనసేన వర్గాలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు కనబడుతోంది. తమ పార్టీ గుర్తును ప్రకటించడంలో ఆలస్యం అవుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

గతంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు చేసిన విషయం అందరికీ తెలిసిందే! అయితే ఆ దరఖాస్తులో వున్న వివరాల మేరకు ఈసీ ఆ పార్టీ రిజిస్ట్రేషన్ తేదీని ఆగస్టు 23న ప్రకటించింది. ఈలోపు ఆ పార్టీపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని ఎలక్షన్ కమిషన్ ఇటీవలే ప్రకటించింది. దీంతో పవన్ కల్యాణ్ అండ్ జనసేన పార్టీ వర్గాలు కూడా తమ పార్టీ గుర్తింపును రిజిస్ట్రేషన్ కార్యక్రమాల అనంతరం ప్రకటించే అవకాశాలు వున్నాయని వారు తెలిపారు.

పార్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే పార్టీ గుర్తును విడుదల చేస్తే బాగుంటుందని పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు సలహాలు ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న పవన్ ప్రెస్ మీట్ కూడా వాయిదా పడినట్టేనని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పార్టీ క్రియాశీల రాజకీయాల్లో మరింత వేగం పుంజుకోబోతుందని అందరూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ ద్వారా రాజకీయ రంగంలో దిగాలనే ఆశాభావాన్ని పవన్ కల్యాణ్ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  pawan kalyan janasena  election commission of india  ghmc elections  

Other Articles