Tv9 ceo surrended in lb nagar police station on saturday 16 08 2014

tv9 ceo ravi prakash, ravi prakash latest news, tv9 news channel, tv9 news channel live, tv9 ceo ravi prakash case, lb nagar police station

tv9 ceo surrended in lb nagar police station on saturday 16-08-2014 : tv9 ceo surrended in lb nagar police station on saturday. A case is booked on raviprakash and tv9 news channel for commenting vulgar words agaist telangana leaders.

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన టీవ9 సీఈఓ రవిప్రకాష్

Posted: 08/16/2014 07:37 PM IST
Tv9 ceo surrended in lb nagar police station on saturday 16 08 2014

(Image source from: tv9 ceo surrended in lb nagar police station on saturday 16-08-2014)

తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచేలా కథనం ప్రసారం చేశారని టీవీ9 న్యూస్ ఛానెల్ ఫై, ఆ సంస్థ సీఈఓ రవిప్రకాష్ పై జూన్ నెలలో కేసు నమోదయిన సంగతి తెలిసిందే! దీంతో రవిప్రకాష్ శనివారంనాడు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. జూన్ 12వ తేదీ రాత్రి 8.30 నిముషాలకు టీవీ9 ప్రసారం చేసిన బుల్లెట్ న్యూస్ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాప్రతినిథులను కించపరిచే విధంగా కథనం ప్రసారం చేశారని ఆరోపిస్తూ.. 18వ తేదీన ఎల్బీనగర్ కు చెందిన న్యాయవాది సుంకరి జనార్ధన్ గౌడ్ సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

ఈయన ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం.. టీవీ9 సంస్థ, దాని సీఈవో రవిప్రకాష్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. రవి ప్రకాష్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన శనివారం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కేసుకు సంబంధించి కొద్దిసేపు అతనిని విచారించిన తర్వాత తిరిగి ఆయన్ను తిరిగి పంపించేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles