Ap cm chandrababu naidu and telangana cm kcr to meet officially on sunday 17 08 2014

ap cm chandrababu naidu, telangana cm kcr, chandrababu naidu latest news, kcr latest news, chandrababu shake hands kcr, kcr shake hands chandrababu naidu, chandrababu naidu met kcr

ap cm chandrababu naidu and telangana cm kcr to meet officially on sunday 17-08-2014 : ap cm chandrababu naidu and telangana cm kcr ready to discuss and solve about their states problems

బాహాబాహీకి సిద్ధమైన ఆంధ్ర-తెలంగాణ ముఖ్యమంత్రులు

Posted: 08/16/2014 08:04 PM IST
Ap cm chandrababu naidu and telangana cm kcr to meet officially on sunday 17 08 2014

(Image source from: ap cm chandrababu naidu and telangana cm kcr to meet officially on sunday)

ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాబు - కేసీఆర్ లు... వీరిద్దరికి సంబంధించిన వార్తలు ఇప్పటివరకు ఎన్నో వచ్చాయి. చాలావరకు వీరిద్దరు తిట్టుకున్న సందర్భాలే కోకొల్లలు! నేనెంతా.. నువ్వెంతా..? అనుకుంటూ ఇంతవరకు విమర్శలు చేసుకోవడం సరిపోయింది కానీ... కలిసి తమ రాష్ట్రాల పరిష్కారాల కోసం సమావేశమయిన ఘడియలు మాత్రం ఇంతవరకు రాలేదు. ‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో బాబు నాతో పోటీకి రాలేడు’’ అంటూ అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యానిస్తే.. ‘‘నన్ను తిట్టకపోతే కేసీఆర్ రాజకీయంగా బతకలేడు’’ అంటూ బాబు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూపోతే వీరిద్దరి మధ్య నడిచిన మాటలతూటాల వ్యవహారాలు చాలానే వున్నాయి.

వీరిద్దరి మధ్య గొడవల విషయాలు పక్కనపెడితే... ఇరురాష్ట్రాల ప్రజలు మాత్రం వీరిద్దరు ఎప్పుడెప్పుడు కలుస్తారా అంటూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తూ వున్నారు. తమ సమస్యలను పరిష్కరించి.. ఎప్పుడు అభివృద్ధి బాటలోకి నడుపుతారా అంటూ వేచి చూస్తున్నారు. బహుశా ఆ సమయం ఆసన్నమయినట్లు కనిపిస్తోంది. తాజాగా అందిన కొన్ని సమాచారాల ప్రకారం.. చంద్రబాబు, కేసీఆర్ లు అధికారికంగా ఆదివారం (17.08.14) సమావేశం కానున్నారని తెలుస్తోంది. రాజ్ భవన్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ కానుందని అధికారిక ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖ్యంగా తమ రాష్ట్రాల సమస్యలను, వివాదాస్పద అంశాలపై చర్చించుకోనున్నారు.

గతంలో బాబు, కేసీఆర్ లు మన రాష్ట్రానికి రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో కలుసుకున్న సంగతి తెలిసిందే! ఇక, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనేటి విందులో వీరిద్దరూ కలుసుకుని పాల్గొన్నారు. కానీ అధికారికంగా వీరిద్దరు స్వతహాగా ప్రకటనలు జారీ చేసి కలిసింది లేదు. అయితే స్వాంతంత్ర్య దినోత్సవనాడు గవర్నర్ చొరవతో ఇద్దరు సీఎంలు తమతమ రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకునేందుకు అంగీకరించారని తెలుస్తోంది. విభజన తర్వాత బాబు, కేసీఆర్ లు ముఖ్యమంత్రి పదవులను స్వీకరించిన అనంతరం.. అధికారికంగా సమావేశం కావడం ఇదే తొలిసారి అవుతుంది. మరి ఈ సమావేశంలో ఏం జరుగుతుందోనని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles