Kcr briefs about meeting with chandrababu naidu

kcr, telanagana cm, kcr wiki, kcr family, kcr meet chandrababu naidu, chandrababu meet kcr, raj bhavan, telangana, andhrapradesh, chandrababu naidu wiki, trs, tdp, latest news

kcr briefing about meeting with ap cm chandrababu naidu : me and babu committed to go forward by solving problems with mutual understanding says kcr

కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

Posted: 08/18/2014 10:53 AM IST
Kcr briefs about meeting with chandrababu naidu

ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది. దాదాపు గంటన్నర పాటు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముఖా ముఖీ నిర్వహించుకున్నారు. విభజన సమస్యలను కలిసి పంచుకున్నారు. సమావేశం ఎలా జరిగిందో తెలియదు కానీ.., ఫలప్రదంగా ఉందని తెలంగాణ సీఎం ప్రకటించారు. తెలుగు రాష్ర్టాల కోసం కేంద్రం అసలు ఏ కమిటి నియమించనవసరం లేదన్నారాయన. మనది మనమే పరిష్కరించుకుందాం అని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు పరష్కరించుకుంటే అభ్యంతరమే లేదని విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. కాబట్టి ప్రతి సమస్యను చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు. తెలుగు రాష్ర్టాలు బాగుండాలన్నదే తన ధ్యేయంగా కేసీఆర్ స్పష్టం చేశారు.

ఉద్యోగుల విభజన, విద్యార్థుల ఫీజు రి ఎంబర్స్ మెంట్ ఇలా అన్ని ప్రధాన సమస్యలు ఈ భేటిలో చర్చకు వచ్చాయి. అయితే వీటిలో కొన్ని ఓ కొలిక్కి వచ్చినా.. మరికొన్ని మాత్రం వివాదంగానే ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగుల విభజనపై ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారమే విభజన చేయాలని తీర్మానించారు. ఫీజు రి ఎంబర్స్ మెంట్ అంశం ఇంకా కొలిక్కి రాలేదు. బాబు ప్రతిపాదించిన 58:42 చెల్లింపుతో పాటు స్థానికతపై కూడా కేసీఆర్ సుముఖత చూపలేదు. స్థానికతపై తమ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుటుందని తేల్చిచెప్పారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి సూచించిన పలు అంశాలను కూడా బాబు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే పెద్ద పురోగతి లేకపోయినా.., విభజన తర్వాత ఇద్దరు సీఎంలు కలుసుకున్న ఘటన ఇది. ఇదే తొలి సమావేశం కావటంతో అన్ని అంశాలు పరిష్కారం కావని రాజకీయ నేతలంటున్నారు. అటు ఏపీకి రాజధాని ఎంపికలో కేసీఆర్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అమరావతి మంగళగిరి మద్య అయితే బాగుంటుందని బాబుకు కేసీఆర్ సూచించారు.

కరడుగట్టిన విభజన వాది అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ బాగుండాలని కోరుకున్నారు. తెలుగు రాష్ర్టాలు రెండూ బాగుండాలని ఆయన కోరుకున్నారు. అన్ని అంశాలకు స్పష్టత ఉందన్నారు. ఎవరికి భయపడమని స్పష్టం చేశారు. సమగ్ర సర్వే జరిగి తీరుతుందన్నారు. ఇది అనర్హులను గుర్తించేందుకు తప్ప.., ఆంధ్రావారికి వ్యతిరేకంగా జరగటం లేదన్నారు. తెలంగాణలో ఉన్న కుటుంబాల కంటే రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. పేద కుటుంబాలకు ఇళ్ళు కట్టించినా.., ఇంకా ఇళ్ళు లేనివారెందరో ఉన్నారని చెప్పారు. ఇలా ప్రభుత్వ పధకాలు పక్కదారి పట్టకుండా పటిష్టంగా అమలు చేసేందుకే సర్వే చేస్తున్నామన్నారు. మోడిని ఫాసిస్టు కాదు ఆయన విధానాలపై మాత్రమే విమర్శలు చేశానన్నారు. ఇక తాను అన్యాయాలపై హిట్లర్ లా వ్యవహరిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  chandra babu naidu  raj bhavan  latest news  

Other Articles