Prisoner escaped from open air jail of chanchal guda petrol bunk with money

chanchal guda jail, chanchal guda jail scandle, charlapally jail, jails, prisoners, petrol bunk, open air jail, police, search, money, hyderabad news, rangareddy district, latest news, telangana police

a prisoner escaped from a open air jail of chanchal guda petro bunk with 68000 money : police on hunt for escaped prisoner from chanchal guda jail petrol bunk

పోలీసులకు మస్కా.. డబ్బుతో ఖైదీ పరార్ !!

Posted: 08/20/2014 11:04 AM IST
Prisoner escaped from open air jail of chanchal guda petrol bunk with money

కుక్కను తీసుకువచ్చి బంగారు సింహాసనంపై కూర్చోబెట్టినా దాని బుద్ది మారదు. అలాగే కొందరు ఖైదీలకు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో  మార్పుండదు. చంచల్ గూడ జైలు పెట్రోల్ బంకు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. సయ్యద్ సాజిద్ అనే ఖైదీ భార్యను హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే ఇతడిని చర్లపల్లి జైలు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలుకు వచ్చిన సమయంలో సాజిద్ మంచివాడిగా ఉండటంతో సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా గుర్తించిన పోలిసులు జైలు ఆవరణలోని పెట్రోల్ బంకులో పని చేయిస్తున్నారు. కొద్ది రోజుల పాటు బాగానే పనిచేసిన సాజిద్ మెదడులో పురుగు తొలిచింది. దగ్గర్లో డబ్బు కన్పించే సరికి చేతులకు దురద పుట్టింది.

ఇంకేముంది ఓపెన్ ఎయిర్ జైలు కావటంతో సెక్యురిటీ తక్కువగా ఉంటుంది. దీన్ని గమనించి సరైన సమయం చూసి బంకులోని 68వేల నగదుతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలిసులు సాజిద్ కోసం గాలిస్తున్నారు. ఆవేశంలో తప్పు చేసిన ఖైదీలు జైలులో మగ్గి, కుంగిపోకుండా ఉండేందుకు వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఖైదీల్లో మంచి ప్రవర్తన కలిగిన వారిని జైలు పరిధిలోని వంట శాలలు, వ్యవసాయ క్షేత్రాలతో పాటు, పెట్రోల్ బంకుల్లో పని చేయిస్తారు. ఇలా చేయటం వల్ల వారికి జైలు జీవితంలో కాస్త ఉపశమనం దొరకటంతో పాటు, బయటకు వెళ్ళగానే పని దొరికే వరకు కాస్త డబ్బు చేతిలో ఉంటుందని అధికారులు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే సాజిద్ లాంటి వ్యక్తుల వల్ల నిజంగా మార్పు వచ్చిన ఖైదీలను కూడా అనుమానించే పరిస్థితి వస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chanchal guda jaill  prisoner escape  money  latest news  

Other Articles