Bcci came into notice that cricketers in england neglected matches because of their wives aside

bcci, indian cricket team, dhoni, indian cricketers, england tour, yuvaraj singh, virat kohli, cricketers girl friends, wives, mathces, highlights, latest news, cricket news, india england matches

bcci noticed that in england tour indian cricketers spent time with wives than ground : bcci decided not to allow wives for foreign matches of indian team

భార్యల వల్లే భారత్ వెనకబడింది !!

Posted: 08/22/2014 10:28 AM IST
Bcci came into notice that cricketers in england neglected matches because of their wives aside

ఎంతటి మగవాడయినా భార్యల ముందు దిగదుడుపే. కొమ్మలు తిరిగిన మగాళ్ళు, మనగాళ్ళు కూడా మగువ ముందు మోకరిళ్ళక తప్పదని నానుడి ఎప్పటి నుంచో ఉంది. ఏ ముందీ ఆడవాళ్ళలో కత్తిలాంటి మగాడిని కూడా కొంగుకు కట్టేసుకుంటారని సినిమా డైలాగులు ఎన్నో విన్నాము. ఇది నిజంగా నిజం. కాదంటే బీసీసీఐని అడగండి. మహిళలు.. అందులో భార్యల పవర్ ఏంటో వారికి తెలుసు. ఇంగ్లాండ్ గడ్డపై భారత్  అతి దౌర్బాగ్యపు ప్రదర్శనపై పోస్టుమార్టం మొదలు పెట్టిన బీసీసీఐ వాస్తవాలను వెలికి తీస్తోంది. మ్యాచ్ ఎందుకు ఓడిపోయింది, ఓటమికి కారణాలు ఏమిటి.., తప్పు ఎక్కడ జరిగింది అనే అంశాలపై లోతుగా విశ్లేషిస్తోంది. ఈ సందర్బంగా వారికో నిజం తెలిసింది. ప్రతి విజయం వెనక ఆడవారు ఉండటం సంగతి అటుంచితే.., ఈ సారి పరాజయం వెనక మాత్రం ఖచ్చితంగా వారున్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

ఇంగ్లాండ్ సిరీస్ కు కొంతమంది క్రికెటర్లు వారి భార్యలను తీసుకెళ్ళారు. అయితే ఈ వెసులుబాటు ఎప్పటినుంచో అమల్లో ఉంది. కుటుంబానికి దూరంగా ఉంటున్నామనే భాద మ్యాచ్ పై పడకుండా ఇలా అనుమతిస్తున్నారు. అయితే ఇప్పుడిదే ఇండియా కొంప ముంచింది. పుజారా, విజయ్, అశ్విన్, బిన్నీ, గంభీర్ తమ భార్యలతో కలిసి ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లారు. ఇక విరా్ కోహ్లీ తన గర్ల్ ఫ్రెండ్ను తోడు తీసుకెళ్ళాడు. ఈ సిరీస్ లో విరాట్ ఫెయిల్యూర్ పై దృష్టి పెట్టిన బీసీసీఐ.., మనవాడి పరాజయానికి అనుష్క శర్మే కారణంగా గుర్తించారు. మ్యాచ్ తో నేరుగా సంబంధం లేకపోయినా ఆమెతో ఎక్కువ సమయం గడపటం..,  దాని గురించే ఆలోచించటం వల్ల ఆటపై దృష్టి పెట్టలేదని తెలిసింది. భార్యలను తీసుకెళ్ళిన క్రికెటర్లు కూడా ఇదే పనిలో ఉన్నట్లు బీసీసీఐ తెలుసుకుని ముక్కున వేలేసుకుంది. ఇంగ్లాండ్ లో క్రికెట్ మ్యాచ్ ప్రాక్టిస్ పక్కనబెట్టి.., ఇలా భార్యలతో ఎక్కువ సమయం ఉండటం వల్ల ఏకాగ్రత దెబ్బతిందని గుర్తించింది. మన క్రికెటర్లు జిమ్, ప్రాక్టీస్ కో వెళ్దామని ప్రిపేర్ అవుతుంటే..,  సిటి చూద్దాం.., షాపింగ్ కు వెళ్దామని భార్యలు కోరటంతో చేసేది లేక బెండయ్యారట.

ఈ విషయం గుర్తించిన బీసీసీఐ ఇక భార్యలను ఉపేక్షించవద్దని నిర్ణయించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లి గర్ల్ ఫ్రెండ్ ను అధికారికంగా టూర్ కు అనుమతించటంపై విమర్శలు వచ్చాయి. దీంతో తప్పు తెలుసుకున్న బోర్డు.., ఇకపై ఫారిన్ టూర్లకు క్రికెటర్లతో వారి భార్యలను పంపవద్దని భావిస్తొంది. అటు ఇంగ్లాండ్, ఆస్ర్టేలియా దేశాల్లాగ కొన్ని పరిమిత రోజులు భార్యలను అనుమతించాలని మరో ప్రతిపాదన కూడా పరిశీలిస్తోంది. అదీ మనవాళ్ళ పరిస్థితి.., ఆట ఆడి గెలవండి.., దేశ సత్తా చాటండి అని పంపితే.., అక్కడేం చేశారో చూశారుగా. పాపం వీళ్లనేమంటాం వీక్ నెస్ అలాంటిది అనుకోవటం తప్ప.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci  england matches  indian cricket team  latest news  

Other Articles