Pathipati pulla rao introduced agriculture budget in ap assembly

ap government, chandrababu naidu, budget, tdp, political parties ycrcongress, jagan, pathipati pulla rao, agriculture budget, telangana government, trs, latest news, agruculture university, horticulture, education, silk

pathipati introduced agriculture budget in ap assembly : with rs. 13108 crores pathipati introduced ap agriculture budget says ap will become leader in agriculture sector

ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్

Posted: 08/22/2014 11:39 AM IST
Pathipati pulla rao introduced agriculture budget in ap assembly

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి పత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 13,108 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ. 6,735 కోట్లు కాగా.., ప్రణాళికేత వ్యయం రూ.6373కోట్లుగా చూపారు. పంట రుణాల మాఫీ, రైతులకు ఉచిత కరెంటు సహా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామిని ప్రభుత్వం నెరవేరుస్తుదన్నారు. అప్పుల ఊబిలో ఉన్న రైతులకు మనోధైర్యం కల్పించేలా బడ్జెట్ రూపొందించామన్నారు. ఈ బడ్జెట్  ప్రవేశపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పత్తిపాటి తెలిపారు.

ఏపీ వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు ::-

వ్యవసాయ బడ్జెట్ మొత్తం: రూ. 13,108కోట్లు

* ప్రణాళిక వ్యయం రూ. 6735 కోట్లు

* ప్రణాళికేతర వ్యయం రూ. 6373 కోట్లు

* పంట రుణమాఫీకి రూ. 5 వేల కోట్లు

* విత్తన సరఫరా రాయితీకి రూ. 212 కోట్లు

* యాంత్రీకరణకు రూ. 90 కోట్లు

* పావలా వడ్డీకి రూ. 230 కోట్లు

* ఉత్పాదక పెంపుదలకు రూ. 153.23 కోట్లు

* వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ. 192 కోట్లు

* సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌కు రూ. 34 కోట్లు

* ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 30 కోట్లు

* పట్టుపరిశ్రమకు రూ. 122 కోట్లు

* సహకారశాఖకు రూ.156 కోట్లు

* రైతుల ఉచిత విద్యుత్‌కు రూ.3,188 కోట్లు

* వ్యవసాయంతో ఉపాధి హామీ అనుసంధానానికి రూ.1,388 కోట్లు

* వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.112 కోట్లు

* పశుసంవర్థకశాఖకు రూ.723 కోట్లు

* పశుగణ అధునాతన పరిశోధన కేంద్రానికి రూ.15 కోట్లు

రైతులను ప్రభుత్వం ఎప్పుడూ ఆదుకుంటుందన్నారు. పంట రుణాలు, రుణాల మాఫీపై పూర్తి స్పష్టతతో ఉన్నామన్నారు. ఇక వ్యవసాయం, అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తామన్నారు. చేపల పెంపకం, పశు సంవర్ధకం వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో గణనీయ వృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తామని పత్తిపాటి అన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ndhra pradesh  agriculture budget  latest news  pathipati pulla rao  

Other Articles