Digvijay singh suspended telangana congress leaders

digvijay singh latest news, digvijay singh news, telangana congress leaders, telangana congress ministers, telangana congress party, ponnala lakshmaiah, tpcc ponnala lakshmaiah

digvijay singh suspended telangana congress leaders : digivijay singh orders to tpcc ponnala lakshmaiah to suspend the telangana leaders for misbehave with senior leaders in campaign

డిగ్గీరాజా వల్ల సమస్యల్లో పడిన తెలంగాణ..!

Posted: 08/25/2014 11:12 AM IST
Digvijay singh suspended telangana congress leaders

కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు రాష్ట్ర వ్యవహారాల మంత్రిగా కొనసాగుతూ... రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన డిగ్గీరాజా ఎవరో అందరికీ తెలిసే వుంటుంది. అంతెందుకు.. మొన్నటికి మొన్న ఒక టీడీ యాంకర్ తో ఈ డిగ్గీరాజా సరసాసల్లాపాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు కూడా! అది దేశమొత్తం మీద పెద్ద దుమారాన్నే రేపింది. అయితే తాజాగా ఈయనలో దాగివున్న మరో కొత్త కోణం నిన్నటికి నిన్నే బయటపడింది. ఈయన వ్యవహరించిన తీరుతో తెలంగాణ రాష్ట్రంలో వున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త సమస్యల్లో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇబ్బందుల్లో పడింది తెలంగాణ రాష్ట్రం కాదు.. తెలంగాణా కాంగ్రెస్ పార్టీ!

ప్రస్తుతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న దిగ్విజయ్ సింగ్.. హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నం సమీపంలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ వర్క్ షాప్ లో రెండురోజులవరకు పాల్గొన్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఆయన తన అసలు రంగును బయటపెట్టేశారు. దీంతో అక్కడున్న సీనియర్ నాయకులుసైతం ఈయన వ్యవహారాన్ని చూసి షాక్ తిన్నారు. ఒక జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న డిగ్గీరాజా... ఏకంగా పార్టీకే నష్టం వస్తుందని, దీని మొత్తం బాధ్యత ఆయనే వహించాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు జరిగిన విషయం ఏమిటంటే.. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐసీసీ కుంతియా ప్రసంగిస్తున్న సమయంలో.. నల్గొండకు చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నేత ఉత్తమ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమక్కూడా సభలో ప్రసంగించే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో డయాస్ పై వున్న నేతలు, ఇతర కార్యకర్తలు వారిని ఎంత నచ్చజెప్పినా, ఎంత వారించినప్పటికీ .. వారు మాత్రం వినకుండా తమ పని తాము చేసుకుంటూపోయారు. దీంతో కుంతియా తన ప్రసంగాన్ని నిలిపేశారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి ఆగ్రహించిన దిగ్విజయ్ సింగ్.. మైకును తీసుకుని తాను ఇటువంటి క్రమశిక్షణా రహిత చర్యలను సహించబోనని తెలియపరుస్తూనే.. వివాదాన్ని రేకెత్తించిన కార్యకర్తలను వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆదేశించారు. అయితే.. డిగ్గీరాజా తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం వుందని ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎన్నో సమస్యల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ... ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇలా వ్యవహరిస్తే తెలంగాణాలో నామరూపాలు లేకుండా తుడుచుపోతుందని వారు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

ఇదిలావుండగా.. ఈ సమావేశంలోనే డిగ్గీరాజా, వీ.హనుమంతరావు డయాస్ పై వాగ్యుద్ధానికి దిగారు. ఆ సమయంలో వీహెచ్ తీరు ఏమీ బాగోలేదంటూ డిగ్గీరాజా ఆగ్రహించారు. దీంతో వీహెచ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇలా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒకర్నొకరు తిట్టుకుంటూ, నిందించుకోవడానికే సమయం సరిపోతోంది. ఇది ఇలాగే కొనసాగుతూ వస్తే మాత్రం.. తెలంగాణాలో కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసుకుంటూపోతారు. చివరికి ఆ పార్టీ నామరూపాలు లేకుండానే పోతాయి. మొత్తంగా.. డిగ్గీరాజా వల్ల తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ సమస్యల్లో పడిందనే తెలుస్తోంది!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : digvijay singh  telangana congress leaders  congress meeting  ponnala lakshmaiah  

Other Articles