తనను నమ్ముకుని నట్టేట మునిగిన వారికి ఉపశమనం కల్గించటంపై జగన్ దృష్టి పెట్టారు. ఇందులో ముందు వరుసలో ఉంది విజయసాయిరెడ్డి. జగన్ సంస్థల ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి సంస్థల లావాదేవీలన్ని చూసుకునేవారు. ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడకు ఎలా వెళ్ళాలి.., ఎలా, ఎప్పుడు రావాలి? ఇలా అన్ని అంశాలు విజయసాయి చూసుకునేవారు. పెట్టుబడుల కోసం కంపనీలను సృష్టించి వాటి నుంచి నిధులను మళ్ళించిన తెలివి సాయిదే అని అందరికీ తెలుసు. ఆ తర్వాత జగన్ కేసుల్లో ఇరుక్కుంటే ఆయనతో పాటు ప్రతి చార్జ్ షీట్ లో నిందితుడుగా చేరారు. ఒకే జైలులో ఇద్దరూ శిక్ష అనుభవించారు. సాయి అంత తెలివి ప్రదర్శించాడు కాబట్టే.., సీబీఐ కూడా కంపనీలన్ని బోగస్ వి అని తేల్చింది తప్ప వాటిలోని నిధులపై స్పష్టమైన సమాచారం సేకరించలేకపోయింది.
తనకింత సాయపడ్డ సాయికి కాస్తయినా సాయం చేయాలని జగన్ తలచారు. పెద్ద మనసుతో పెద్దల సభకు పంపాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది అటుంచితే విజయసాయి ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాల్సిన వ్యక్తిగా వార్తలు విన్పిస్తున్నాయి. వైఎస్ హయంలో టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఏడుకొండలవాడికి సేవ చేశాడు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటి చేయాలని కష్టపడి డబ్బు కూడబెట్టుకున్నాడు. అయితే సమీకరణాలు సెట్ కాక.. ఫేట్ కలిసి రాలేదు. దీంతో రాజ్యసభ సీటు పక్కా అని జగన్ మాట ఇచ్చి ఓదార్చారు.
ఇచ్చిన మాట ప్రకారం పెద్దల సభలో సీటు ఇవ్వాలంటే విజయసాయి పార్టీలో నేతగా ఉండాలి. లేదంటే రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తాయి. ఈ విషయం ముందుగానే గ్రహించిన జగన్.., ఈ మద్యే విజయసాయిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. ఆయనకు ప్రజల పట్ల ఉన్న సేవాభావంను చూసే ఈ పదవి ఇచ్చినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడిక రాజ్యసభ సీటు ఖాళీకాగానే అందులో విజయసాయిని భర్తీ చేస్తారన్నమాట. అటు కేసుల్లో చిక్కుకుని తనతో కష్టకాలంలో అండగా ఉన్న ఇతరులనూ జగన్ ఆదుకుంటున్నారు. ఈ మద్య ప్రకటించిన పార్టీ పదవుల లిస్ట్ చూస్తే ఇది తెలుస్తుంది. ప్రధాన కార్యదర్శులుగా భూమన కరుణాకర్, మోపిదేవి, సుజయ కృష్ణ, ధర్మాన, జంగా కృష్ణమూర్తి, మైసూరా, ప్రసాద్, విజయసాయిలను నియమించారు. ఇందులో ధర్మాన, మోపిదేవి, విజయసాయిలు కేసులో నిందితులుగా ఉన్నవారే. అంటే తనను నమ్ముకున్న వారికి ఎప్పటికైనా న్యాయం చేస్తానని జగన్ సంకేతాలిస్తున్నాడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more