Apple replacing some of its i phone s battries for free

apple company, i-phone, i phone 5s, i phone accessories, mobile phones, battries, latest news, technology, mobile reviews, mobile price, apple free battries

Apple company announced that it will replace battries freely for some of i-phones : i-phones sold in a period will get free battery replacement says apple company

ఐ ఫోన్లకు ఫ్రీగా బ్యాటరీలిస్తున్న యాపిల్

Posted: 08/25/2014 04:55 PM IST
Apple replacing some of its i phone s battries for free

యాపిల్ కంపనీ ఫ్రీగా బ్యాటరీలిస్తోంది. దగ్గర్లోని యాపిల్ స్టోర్ కు వెళ్ళి బ్యాటరీ ఉచితంగా మార్చుకోవచ్చని చెప్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు. యాపిల్ ఐ ఫోన్ వినియోగదారుల్లో కొంతమందికి మాత్రమే. 2012సెప్టెంబర్ నుంచి 2013 జనవరి మద్య కాలంలో అమ్మిన ఐ-ఫోన్లలో బ్యాటరీల పరంగా ఇబ్బంది ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. త్వరగా చార్జింగ్ అయిపోవటం, వెంట వెంటనే చార్జింగ్ పెట్టాల్సి రావటం వంటి సమస్యలు రావటాన్ని కంపనీ గుర్తించింది. వినియోగదారుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఆ ఐదు నెలల కాలంలో ఫోన్లు కొన్న వారు తమ ఫోన్ తీసుకొస్తే ఉఛితంగా బ్యాటరీ మార్చి ఇస్తామని ఉచితంగా చెప్తోంది. ఆగస్టు 22నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. మీ ఫోన్ బ్యాటరీ మార్పునకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలంటే యాపిల్ వెబ్ సైట్లోని ఫ్రీ బ్యాటరీ మార్పు పై సెలక్ట్ చేసి అందులో మెబైల్ సీరియల్ నంబర్ ఎంటర్ చేస్తే తెలిసి పోతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

 

అంతేకాదు ఇప్పటికే ఎవరైనా డబ్బులు కట్టి బ్యాటరీ మార్చుకున్నా.., వారు బిల్ తెచ్చిస్తే డబ్బు వాపస్ ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ అందరికి వర్తించదని స్పష్టం చేసింది. ఫోన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం బ్యాటరీ మాత్రమే సమస్యగా ఉంటే ఉచితంగా మారుస్తామని చెప్పింది. డిస్ ప్లే తేడా, ఇతర ఇబ్బందులుంటే వాటి వల్ల బ్యాటరీ లైఫ్ తక్కువగా వస్తుందని కాబట్టి అటువంటి ఫోన్లకు ఉచితంగా మార్చలేమని స్పష్టం చేసింది.

 

యాపిల్ ఫోన్లు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ కలిగినవి. ఈ కంపనీ నుంచి వచ్చిన ఐ ఫోన్ అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. ఐ ఫోన్ ఉన్నవారంటే అందర్లో ప్రత్యేకత ఉండేది. ఫోన్లనే కాకుండా ట్యాబ్, కంప్యూటర్లు, ఐ ప్యాడ్, జీపీఎస్, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలను యాపిల్ తయారు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లు, కంపనికి ఉన్న పేరును దృష్టిలో ఉంచుకుని.., బ్యాటరీలపై ఫిర్యాదులతో పేరు దెబ్బ తినకుండా ఉచితంగా మార్చి కస్టమర్ల పట్ల బాధ్యతను చాటుతోంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple phones  i phone  free battery  latest news  

Other Articles