కేవలం సాంకేతికపరంగానే కాకుండా ఒక ప్రపంచ పర్యాటక ప్రాంతంగా వెలిగిన ‘‘సింగపూర్’’ లాంటి ప్రదేశాలను సందర్శించినప్పుడు అందరినోటా ‘‘వావ్’’ అనే మాట రాకతప్పదు. ప్రకృతికి ప్రతిరూపంగా ఎంతో అందమైన ప్రదేశాన్ని విహరించడానికి ప్రపంచం మొత్తం మీద ఎంతోమంది పర్యాటకులు నిత్యం వస్తూపోతూ వుంటారు. ఇక మన ఇండియన్స్ అయితే అక్కడ క్యూలో నిలబడిపోయి వుంటారు. అయితే ఇక్కడ మనం చర్చించుకుంటున్నది ప్రత్యేకంగా ప్రాంతం గురించిగానీ.. అక్కడికి వెళ్లే పర్యాటకుల గురించి కాదులెండి... ఆ ప్రాంతాన్ని సందర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి! సింగపూర్ టూర్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగపూర్ లో ఆయన అనుభూతి గురించి వివరిస్తూ ఇలా అభివర్ణించారు.
తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఒక విదేశీ పర్యటన భాగంగా సింగపూర్ టూర్ కు వెళ్లిన కేసీఆర్... ఆ పర్యటన తనకు అద్భుమైన అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిలో అగ్రరాజ్యమైన అమెరికా సరసన సింగపూర్ నిలిచిందని చెప్పిన ఆయన... ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఎలా అభివృద్ధి చెందాలో ఆ ప్రాంతం నిరూపించిందని కొనియాడారు. మంచినీరు సహా ప్రతి వస్తువును సింగపూర్ నుంచి దిగుమతి చేసుకోవాల్సిందేనని పేర్కొన్న ఆయన.. అక్కడి ప్రభుత్వ విధానాలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో అమోఘంగా వుందని... అటువంటి విధానాలను ఇక్కడ కూడా పాటిస్తే చాలా త్వరగా అభివృద్ధి చెందవచ్చునని అభిప్రాయపడ్డారు. భూవైశాల్యం చాలా తక్కువగా వున్నప్పటికీ.. సింగపూర్ దానిని చాలా తెలివిగా పరిష్కరించిందని తెలిపారు.
ప్రజాప్రతినిధులకు సింగపూర్ లో శిక్షణ
మీడియా సమావేశంలోనే కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే తమ ప్రజాప్రతినిధులందరినీ సింగపూర్ పంపాలనే ఆలోచన వుందని ఆయన తెలిపారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ నేతలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాల్సిందిగా అక్కడి ప్రధానిని కోరినట్లు ఆయన చెప్పారు. సింగపూర్ లోని అన్నిరంగాల ప్రగతిపై అధ్యయనం చేశానని పేర్కొన్న ఆయన... అటువంటి రంగాలను మన తెలంగాణాలోనూ ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు జరుపుతామని ఆయన వెల్లడించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more