(Image source from: ysrcp mla roja fires on tdp ministers in assembly)
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్, హత్యారాజకీయ సమావేశాల్లో వైకాపా, టీడీపీ నేతల మధ్య పెద్ద వాగ్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణరెడ్డి వైకాపా నేతలపై విమర్శలు చేస్తూ.. ఎమ్మెల్యే రోజాపై ధ్వజమెత్తి.. ఆమెను ‘‘ఐరన్ లెగ్’’గా అభివర్ణించారు. దీంతో మండిపడిన ఎమ్మెల్యే రోజా.. ఆయనకు, టీడీపీ పార్టీ అభ్యర్థులకు ధీటుగానే సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మాట్లాడిన ఆమె.. ‘‘ఐరన్ లెగ్’’ తనది కాదని, గోపాలకృష్ణారెడ్డిదేనని ఆమె అన్నారు. చంద్రబాబు మీద బాంబుదాడి జరిగినప్పుడు ఆ కారులో ఆయనే వున్నారని.. అలాగే వైఎస్ మరణానికి ముందురోజు కూడా క్యాంపు కార్యాలయంలో బొకేతో వెళ్లింది ఆయననే రోజా మండిపడ్డారు.
అంతకుముందు సభలో మాట్లాడిన రోజా.. టీడీపీలో వున్న కార్యకర్తలందరూ మద్యాన్ని డోర్ టు డోర్ డెలివరీ చేస్తూ ఏజెంట్లుగా అయిపోయారని చురకలంటించారు. ఎవరైనా సరే.. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మద్యాన్ని ఇళ్లకు తీసుకెళ్లి మరీ ఇచ్చేంత స్థాయికి దిగిపోయారని పేర్కొంది. దీంతో ఇది మహిళా సంక్షోభ ప్రభుత్వమని మొదటి బడ్జెట్ లోనే తెలిసిపోయిందని అన్నారు. మధ్యమధ్యలో టీడీపీ సభ్యులు, మంత్రులు ఆమెను పదేపదే అంతరాయం కలిగించినప్పటికీ.. వారికి ధీటుగానే సమాధానం చెబుతూ తన ప్రసంగాన్ని కొనసాగించింది. టీడీపీ పార్టీ వల్ల కలిగిన నష్టాలను, అవినీతి గురించి ఆమె సభలో కొద్దిసేపటి వరకు వివరించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more