Nithyananda should undergo potency test

Nithyananda, Nithyananda scandal, Nithyananda ranjitha video, Nithyananda ashram, sex scandal video, rape cases, supreme court, latest news, hindhu, potency test, karnataka high court

supreme court orderd Nithyananda to undergo for potency test : in a rape case nithyananda should go potency test orderd supreme court

నిత్యానందకు లైంగిక పరీక్ష తప్పదు - సుప్రీం

Posted: 09/03/2014 11:35 AM IST
Nithyananda should undergo potency test

స్కాండల్ స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. స్వామీజికి లైంగిక సామర్ధ్య పరీక్ష తప్పకుండా చేయించుకోవాలని ఆదేశించింది. కర్ణాటక హైకోర్టు ఈ విషయంలో ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ స్వామి పిటిషన్ కొట్టేసింది.
నిత్యుడు తనపై అత్యాచారం చేశాడని ఆయన ఆశ్రమంలో ఉండే భక్తురాలు నాలుగేళ్ళ క్రితం ఫిర్యాదు చేసింది. దీనిపై కేసునమోదు చేసిన పోలిసులు నిత్యానందను గతంలో అరెస్టు చేసి విచారించారు. అయితే తనకే తప్పు తెలియదని నాలుగేళ్ళుగా వాయిదాలు వేస్తూ విచారణ తప్పించుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే రెండేళ్ళ క్రితం నిత్యానంద కేసుపై విధించిన స్టేను కర్ణాటక హైకోర్టు జులై 16న ఎత్తేసింది. లైంగిక సామర్య్ధ పరీక్షకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా విచారణకు సహకరించకుంటే అరెస్టు చేయాలని సీఐడీకి అనుమతి ఇచ్చింది. ఆగస్టు 6తో హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తియినా స్వామిజి ఎందుకో సామర్ధ్య పరీక్షకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు నాన్ బెయలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ పరిణామంతో ఖంగుతిన్న స్వామిజి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తనపై అంతా కుట్ర పన్ని కేసులో ఇరికించారనీ.., తనకే పాపం తెలియదని సుప్రీంకు తెలిపాడు. ఈ వాదనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు.., కర్ణాటక హైకోర్టు సరిగానే వ్యవహరించిందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. నిత్యానంద లైంగిక సామర్ధ్య పరీక్షకు వెళ్ళక తప్పదని తేల్చిచెప్పింది. దీంతో స్వామిజి పరీక్ష ఎదుర్కోక తప్పదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithyananda  potency test  supreme court  latest news  

Other Articles