Five more arrested in snake gang

pahadi sharif, mignight, snake gang, snakes, rapes, gang rapes, crime, police search opeartions, arrest, houses, hyderabad news, hyderabad houses, latest news, telangana, cv anand, hyderabad police, cyberabad police

five more persons arrested in snake gang says cv anand : midnight search operations in pahadi shareef area caught five more snake gang accused persons

స్నేక్ గ్యాంగ్ లో మరో ఐదుగురి అరెస్టు

Posted: 09/03/2014 11:11 AM IST
Five more arrested in snake gang

స్నేక్ గ్యాంగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టిన సైబరాబాద్ పోలిసలు తాజగా మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పహాడిషరీఫ్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలిస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పహాడిషరీఫ్ ప్రాంతంలోని షాహిన్ నగర్ ఇతర ఏరియాల్లో 400మంది పోలిసులు అణువణువూ జల్లెడపట్టారు. ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

అర్ధరాత్రి తనిఖీల సందర్బంగా పలువురు రౌడీషీటర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్నేక్ గ్యాంగ్ కు సంబంధించి ఇప్పటివరకు 13మందిని గుర్తించగా గత రాత్రి ఐదుగురిని అరెస్టు చేశారు. అంతేకాకుండా తనిఖీల్లో ముప్పై బైకులు, రెండు కార్లు, మూడు వ్యాన్లు సీజ్ చేశారు. రెండు గుర్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. స్నేక్ గ్యాంగ్ నిందితులు తమ దౌర్జన్యాల కోసం గుర్రాలను కూడా వినియోగించినట్లు గుర్తించామని ఆనంద్ తెలిపారు. ఈ ముఠా కోసం గాలింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pahadi sharif  cv anand  snake gang  latest news  

Other Articles