Wadia dined that preity zinta put conditions to him

preity zinta, preity zinta ness wadia case, ness wadia, ipl, cricket betting, spot fixing, latest news, five conditions, mumbai news, marine police station, bollywood

wadia group denied rumors that preity zinta put conditions to comprimise case : preity zinta not put any conditions to us says wadia group

ప్రీతిజింటా ఆ షరతులు పెట్టలేదే

Posted: 09/05/2014 06:44 PM IST
Wadia dined that preity zinta put conditions to him

ప్రీతి జింటా షరతులు పెట్టినట్లు వచ్చిన ఊహాగానాలపై వాడియా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ప్రీతి తమకు ఎలాంటి షరతులు పెట్టలేదన్నారు. ఈ విషయంలో వస్తున్నవన్నీ కేవలం ఊహాగానాలే అని వివరణ ఇచ్చారు. వాడియాపై పెట్టిన కేసును ఉపసంహరించుకునేందుకు ప్రీతి ఐదు షరతులు పెట్టినట్లు మీడియాలో కధనాలు వచ్చాయి. దీంతో వాడియా వర్గం స్పందించి ఊహాగానాలను తోసిపుచ్చింది.

ప్రీతిపెట్టిన ఐదు షరతుల్లో నాలుగింటికి వాడియా ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ నాలుగు కండిషన్లు.

1. ఇక మీదట ప్రీతికి దగ్గరయ్యేందుకు వాడియా ప్రయత్నించకూడదు.

2. ప్రీతితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే జరిగే పరిణామాలకు వాడియాదే బాధ్యత. చివరకు ఇద్దరూ భాగస్వాములుగా ఉన్న పంజాబ్ కింగ్స్ లెవెన్ వ్యవహారాలపై కూడా సంబాషణలు, సమాచారాలను

సంబంధిత అధికారుల ద్వారా మాత్రమే చేరవేయాలి.

3. కంప్లయింట్ వెనక్కి తీసుకున్నందుకు ప్రీతి ఎలాంటి పరిహారం పొందదు.

4. ఇకపై ప్రీతి వ్యక్తిగత వ్యవహారాలు దేనిలోనూ తలదూర్చకూడదు.


నెస్ వాడియా తనను లైంగికంగా హింసించినట్లు ఈ ఏడాది జూన్ 12న మెరైన్ పోలిస్ స్టేషన్ లో ప్రీతి జింటా ఫిర్యాదు చేసింది. మే 30న చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు మద్య జరిగిన మ్యాచ్ సందర్బంగా స్టేడియంలో వాడియా తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. ఈ ఆరోపణలను నెస్ తోసిపుచ్చాడు. అటు పోలిసులు జరిపిన విచారణలో కూడా నెస్ -జింటా మద్య మ్యాచ్ సందర్బంగా ఎలాంటి వివాదం  జరిగనట్లు చూడలేదని చెప్పారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ness wadia  preity zinta  latest news  five conditions  

Other Articles