Kcr delhi tour schedule

kcr, k. chandrashekar rao, kcr delhi tour, delhi, trs, telangana, hyderabad, andhrapradesh, ias, ips, ifs, governor, central ministers, rajnath singh, prime minister, central cabinet, latest news

kcr went to delhi on twodays tour scheduled to meet most of central leaders : kcr went to delhi with expectations on central meeting top leaders of central cabinet including prime minister

చంద్రశేఖరుడు వెడలె హస్తినకు... తెలంగాణ విన్నపాలు వినవలె

Posted: 09/06/2014 08:05 AM IST
Kcr delhi tour schedule

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళారు. శుక్రవారం సాయంత్రం తర్వాత హస్తినకు వెళ్ళిన కేసీఆర్.., రెండ్రోజుల పర్యటనలో గడపనున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలందర్ని వరుసపెట్టి కలిసేందుకు అపాయింట్ మెంట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండవసారి ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్.., ప్రధానంగా రాష్ర్ట అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైనే అందరితో చర్చ జరపనున్నారు. కొత్త రాష్ర్టానికి అవసరమైన కేటాయింపులు, ప్రత్యేక ప్యాకేజీల ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెడతారని తెలుస్తోంది.

రెండ్రోజుల ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడితో పాటు కేంద్రమంత్రులు రాజ్ నాధ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరాని, పియూష్ తో సమావేశం అవుతారు. ప్రధాని మోడితో జరిగే సమావేశంలో విభజన వల్ల ఏర్పడ్డ సమస్యలు తొలగించటంతో పాటు.., రాష్ర్ట అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని అదే విధంగా అక్టోబర్ లో హైదరాబాద్ లో జరిగే మెట్రో పోలిస్ సదస్సుకు హాజరుకావాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇక రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ భేటిలో రాష్ర్టంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చ జరగనుంది. అటు మధ్యాహ్నం తర్వాత కేంద్ర మంత్రులతో కేసీఆర్ సమావేశం అవుతారు.

గవర్నర్ గిరీపై తేల్చుకుంటారా?

కేంద్రమంత్రులతో భేటిలో భాగంగా హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ తో కేసీఆర్ సమావేశం అవుతారు. ఈ భేటిలో ప్రధానంగా తెలగాణ- హైదరాబాద్ శాంతిభద్రతలపై చర్చ జరగనుంది. దీంతో పాటు హైదరాబాద్ పై గవర్నర్ అధికారాలను ప్రస్తావించనున్నారు. గవర్నర్ గిరీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కారు.., ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకుంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అధికారాలను తొలగించటం.., లేదా గవర్నర్ పెత్తనాన్ని నామమాత్రం చేసేలా చట్టంలో మార్పులు చేయటంపై  చర్చ జరుగుతుందని పలువురు చెప్తున్నారు. దీంతోపాటు ప్రత్యూష్ సిన్హా కమిటీ నిర్ణయాలు.., రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల వైఖరిపై హోంమంత్రికి వివరించనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కలిసి హైకోర్టును వీలైనం త్వరగా విభజించాలని కోరనున్నారు. ఇక కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా కేసీఆర్ భేటి అవుతారు. రాష్ర్టంలో విద్యుత్ సమస్యలు.., కేటాయింపులపై పియూష్ తో చర్చలు జరుపుతారు.  

జయమ్మను కలుస్తున్న కేసీఆర్


ఆదివారం షెడ్యూల్ లో భాగంగా జయమ్మను ( జై బోలో తెలంగాణ సినిమాలో నటించిన స్మృతి ఇరాని పాత్ర పేరు) కేసీఆర్ కలుస్తున్నారు. తెలంగాణలో విద్యా విధానాల మార్పు.., కొత్త వర్సిటిలు కేంద్ర విద్యాసంస్థలు నెలకొల్పటంపై జయమ్మ(స్మృతి ఇరాని)తో కేసీఆర్ చర్చలు జరుపుతారు. రాష్ర్టానికి ఐఐటీ, ట్రైబల్ యునివర్సిటీ, ఇతర ప్రముఖ విద్యాసంస్థలను కేటాయించాలని కోరతారని తెలుస్తోంది. నిర్మలా సీతారామన్ ను కలిసి పసుపు బోర్డు అంశం, పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం. నిధుల కేటాయింపు, ఇతర అంశాలపై చర్చ జరుపుతారు. అంతేకాకుండా కేంద్రమంత్రులు ఉమాభారతి, రైల్వే మంత్రి సదానంద గౌడలను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి దర్శనం చేసుకుంటున్నారు.

ఇలా రెండ్రోజుల పర్యటనలో ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరినీ వరుస పెట్టి కలుస్తూ.., మీటింగుల మీద మీటింగులతో బిజీగా గడుపుతున్నారు. అయితే కేంద్రంతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం విన్నపాలు వింటారా.. లేక విడిచిపెడతారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. దీనికి తోడు మెదక్ ఉప ఎన్నికల పుణ్యమా అని టీఆర్ఎస్-బీజేపి నువ్వా-నేనా అన్నట్లు తిట్టిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హస్తిన రిజల్ట్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ అనుకోక తప్పదు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  delhi tour  telangana  latest news  

Other Articles