Bifurcation problems still not solved

telangana, andhrapradesh, problems, bifurcation, latest news, ap bifurcation bill, ap re-organisation bill, telangana bill, parliament, hyderabad

ap bifurcation problems still not solved after successfull three months of new state : telangana andhrapradesh problems still not solved

వీడని విభజన సమస్యలు..

Posted: 09/09/2014 11:25 AM IST
Bifurcation problems still not solved

తెలంగాణ రాష్ర్టం ఏర్పడి మూడు నెలలు దాటింది. యూపీఏ 2 పుణ్యమా అని వివాదాల మద్య రెండు తెలుగు రాష్ర్టాలు ఏర్పడ్డాయి. పాలన ముగిసే సమయంలో హడావుడిగా ప్రభుత్వం తెలంగాణ బిల్లును తీసుకొచ్చి అమలు చేసుకుని చేతులు దులుపుకుంది. యూపీఏ వైఖరిపై సీమాంధ్ర ప్రజలు, నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదరాబాదరాగా బిల్లును తెస్తున్న యూపీఏ సమస్యలను పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇప్పుడిదే నిజమవుతోంది., గత యూపీఏ ప్రభుత్వం తొందరపాటుగా తెలిసీ.., తెలియక చేసిన తప్పులకు రెండు రాష్ర్టాలు తగువులాడుకుంటున్నాయి. అన్నీ చెప్పామంటూనే విభజన చట్టంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు పరిష్కార మార్గం చూపలేదు. దీంతో తెలుగు రాష్ర్టాలు పాలనను పక్కన బెట్టి పంచాయతీకి కూర్చుంటున్నాయి.

అలాంటి వివాదాల్లో ఒకటి గవర్నర్ అధికారాలని చెప్పవచ్చు. హైదరాబాద్ లో శాంతిభద్రతల పర్యవేక్షణ, నిర్ణయాలను గవర్నర్ కు అప్పగించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత చూపుతోంది. విభజన చట్టంలో గవర్నర్ కు అధికారాలు అప్పగించారు. గవర్నర్ పోలిసులను నియమించలేరు. నియామకం, శాఖల కేటాయింపు, పాలన అంతా రాష్ర్ట ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నియమించిన అధికారులతో గవర్నర్ సమీక్ష సమావేశాలు మాత్రం నిర్వహించగలరు. వీలయితే ఇలా చేయండి అని ఆదేశాలు ఇవ్వగలరు. ప్రస్తుతం మిగతా రాష్ర్టాల్లో కూడా గవర్నర్ వారి రాష్ర్టంలోని పోలిసు ఉన్నతాధికారులతో సమావేశం కావటం, పరిస్థితులు తెలుసుకోవటం జరుగుతుంది. ఇక వివాదాలకు కారణం అవుతున్న స్థానికత అంశంపై కేంద్రం ఏమి చెప్పలేదు.

పదేళ్లపాటు రెండు రాష్ర్టాల్లో ఉమ్మడి అడ్మిషన్లు జరుగుతాయని చట్టంలో ఉంది. కాని రెండు రాష్ఱ్టాల్లో ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అమలవుతోంది. తెలంగాణలో చేరిన ఏపీ విద్యార్థికి ఎవరు ఫీజు చెల్లించాలి.., ఏపీలో చేరిన తెలంగాణ విద్యార్థికి ఎవరు ఫీజు చెల్లించాలి? ఈ విషయంపైనే తెలంగాణ ప్రభుత్వం స్థానికత అంశాన్ని లేవనెత్తి వివాదాలను కొనితెచ్చుకుంది. ఒక నిష్పత్తి ప్రకారం చెల్లింపులు చేసుకుందామని ఏపీ ప్రభుత్వం చెప్పినా విన్పించుకోవటం లేదు. చట్టం చేసిన యూపీఏ ఈ విషయంపై స్పష్టత ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

వీటితో పాటు చాలా అంశాలు గందరగోళంగా ఉన్నాయి. వీటిపై ఎలా నిర్ణయాలు తీసుకోవాలో యూపీఏ ప్రభుత్వం ఏమి చెప్పలేదు. కేవలం కూర్చుని మాట్లాడుకోవటం.., అవసరం అనుకుంటే కేంద్రం జోక్యం అని చెప్పి చేతులు దులుపుకుంది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ర్టం ఏర్పాటు చేసి చేతులు కాల్చుకుంది కాంగ్రెస్. అటు కష్టపడి రాష్ర్టం తెచ్చుకుంటే కలలు సాకారం అవుతాయనుకుంటే ఏ దిశగా వెళ్లినా విభజన చట్టం ఇబ్బందులే ఎదురవుతుండటంతో బిల్లు రూపొందించిన నేతలపై తెలంగాణ సర్కారు కూడా అసహనం వ్యక్తం చేస్తోంది. ఇందువల్లే అపరిష్ర్కుతంగా ఉన్న అంశాలను పరిశీలించాలని ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు కేసీఆర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap bifurcation  telangana  latest news  problems  

Other Articles